జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ ఎన్‌పీఆర్‌డీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్‌ను సైదా నాయక్ డీఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని అభిప్రాయపడ్డారు. దివ్యాంగులపై చట్టవిరుద్ధంగా దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. వారి ఆస్తిపై దాడి జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను దివ్యాంగులు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రధాన కార్యదర్శి కొనింటి నరసింలు, సీనియర్ నాయకుడు ఐమద్ అన్నా, మొగుడంపల్లి మండలం ఎన్‌పిఆర్‌డి అధ్యక్షుడు రాజ్‌కుమార్, జహీరాబాద్ ఎన్‌పిఆర్‌డి అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్, ఉపాధ్యక్షుడు మాచెందర్ తదితరులు పాల్గొన్నారు.
