ఉద్యమకారుల మహాసభ విజయవంతం చేద్దాంవిద్యార్థి ఉద్యమ నేతల పిలుపు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని అమరదామం వద్ద తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక, తెలంగాణ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో చలో సూర్యపేట, జనవరి 10న జరిగే ఉద్యమకారుల బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ నాయకులు కంచర్ల బద్రి,టియుజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చార్వాక, రంజిత్ మరియు వివిధ సంఘాల ప్రతినిధులు,ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత పాలకులు 10 సంవత్సరాలు ఉద్యమకారులను విస్మరించారని,అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు.నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాలు గడిచిందని, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విపలమయ్యారని,ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని,విద్యార్థి సంఘాల ఉద్యమ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.దానిలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టియుజేఏసీ చేపట్టిన సూర్యపేట బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోడెపాక భాస్కర్,పెండ్యాల రవీందర్, పవన్ కుమార్,రమేష్, చిన్నికృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
