జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి 94వ డివిజన్ షేక్పేట లోని 35, 36, 37, 38 పోలింగ్ బూత్(హజీజ్ బాగ్, అరవింద్ నగర్ కాలనీ)లలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుసేని తదితరులతో కలిసి గల్లీ గల్లీ కలియ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్

ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అడుగుతున్నామని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. బడుగు, బలహీన వర్గానికి చెందిన సోదరుడు నవీన్ యాదవ్ కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, సీఎం రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా చేస్తాడని ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం…!

◆:- ” డీసీసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. ముల్తాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించడం ఖాయమని డీసీసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. ముల్తాని, విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి మద్దతుగా షేక్ పేట్ డివిజన్ లోని 67 బూత్ నెంబర్ లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 67వ బూత్ ఇంచార్జి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్దాం. ఉజ్వల్ రెడ్డి, ఆదేశాల మేరకు షేక్ పేట డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తూ.. సంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఎండి. ముల్తాని మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి బలం చేకూరుస్తారు. కాంగ్రెస్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలు మద్దతు ఇస్తున్నారు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎక్కుడ కనిపించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో జూబ్లీహిల్స్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికీ మరో బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అన్నారు. జూబ్లీహిల్స్ తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ స్విప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదేవిదంగా కేవలం షేక్ డివిజన్ కీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇప్పటికే 95 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టడం జరిగిందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు గెలిపియడానికి సిద్దంగా వున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో జహీరాబాద్ నియోజకవర్గంకు చెందిన మాజీ ఎంపీటీసీ మహేందర్, ఆఫీస్, మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి, ఝరాసంగం మండల యువ నాయకులు అభిలాష్ రెడ్డి, న్యాల్కల్ మండల ఆశభావ జడ్పీటీసీ అభ్యర్థి మొహమ్మద్ యూనూస్, అశ్విన్, తదితరులు స్థానికలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version