హెచ్ పి వి వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ నాగయ్య…..

హెచ్ పి వి వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ నాగయ్య.

కోదాడ, నేటి ధాత్రి: 15

సంవత్సరాల పిల్లలు హెచ్ పి వి వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మందుల నాగయ్య అన్నారు. సోమవారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య ఆధ్వర్యంలో 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు (హెచ్ పి వి) వ్యాక్సిన్ ను వేయించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను నివారించడానికి 14 ఏళ్ల వయసుగల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ను ఉచితంగా అందించి క్యాన్సర్కు కారణం అయ్యే హెచ్ పివి వైరస్ నుండి ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. ఈ వ్యాధిని నివారించడానికి హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్యాక్సిన్ ను 15 ఏళ్ల పిల్లలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, జిపిఓ ఈశ్వర్, ఏఎన్ఎం. చంద్రకళ, సూపర్వైజర్ విజయ్, ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు బాలికలు తదితరులు ఉన్నారు.

ప్రత్యేకఅవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ వరం ఫిజియోథెరపీ వైద్యులు సిహెచ్ రమేష్

ప్రత్యేకఅవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ వరం ఫిజియోథెరపీ వైద్యులు సిహెచ్ రమేష్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల జెడ్పి హెచ్ఎస్ మొగుళ్ళపల్లి భవిత కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించారు గౌరవ మండల విద్యాశాఖ అధికారి శ్రీ లింగాల కుమారస్వామి ఆదేశాల మేరకు నిర్వచించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల శారీరక వైకల్యాల పక్షపాతం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు దివ్యాంగ బాలల బాలికల భవిత కేంద్రంలో ఉచిత విజయోతరపి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దివ్యాంగపిల్లలకు ఆట వస్తువులు బోధన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది . మండలంలోని వివిధ గ్రామాల వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న బాల బాలికల తల్లిదండ్రులు శిబిరానికి తీసుకువచ్చారు అనంతరం పిల్లలకు ఫిజియోథెరపీ చేసి తల్లిదండ్రులకు సలహాలు సూచనలు ఇచ్చారు భవిత కేంద్రంలో ప్రతి సోమవారం బుధవారం ఫిజియోథెరపీ నిర్వహిస్తారుఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం వెంకన్న ప్రవీణ్ బి సదయ్య చిలుక మారి శ్రీనివాస్ తల్లిదండ్రులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version