14 స. బాలికలు హెచ్ పివి టీకాలు వేయించుకోవాలి
మున్సిపల్ చైర్మన్ కొమురయ్య వైస్ చైర్మన్ శ్రీనివాస్
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపాలిటీ పరిధిలో 26వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (గర్భాశయ ముఖంలో ఏర్పడే క్యాన్సర్) 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాలు చేరని బాల, బాలికలకు హెచ్ పివి టీకలు వేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ శ్రీ అంబాల శ్రీనివాస్ 26వ వార్డు కౌన్సిలర్ దుర్గం రాధా ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఈ గర్భాశయ ముఖం లో ఏర్పడే క్యాన్సర్ అనేది సహజంగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపు మహిళలను ఏర్పడుతుంది కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి ఇప్పుడు అన్ని వయసుల వారికి వస్తుంది కాబట్టి ఈ వ్యాధి రాకుండా హెచ్ పివి టీకలు వేసుకోవాలి చిన్న వయసులో వివాహం వ్యక్తిగత శుభ్రత లోపం వల్ల ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది కాబట్టి అందరూ కూడా 14 సంవత్సరాల నిండిన బాల బాలికలు ఈ టీకాలు కంపల్సరిగా వేసుకోవాలని సూచించడం అదేవిధంగా నూతనంగా ఎన్నికైన భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ 26వ వార్డు కౌన్సిలర్ రాధ 25
వ వార్డు కౌన్సిలర్ పోనగంటి మేఘన శ్రీనివాస్ 24 వ వార్డు కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్ ను ఆసుపత్రి డాక్టర్లు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్స్ నర్సులు ఏఎన్ఎంలు సిబ్బంది పాల్గొన్నారు.
