రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T144229.093.wav?_=1

రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

 

 

బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్నంపెట్టే రైతన్నలను నిండా ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు రాజమొగిలి(రవి) యూరియా కోసం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనగా తీవ్రగాయాలపాలై హనుమకొండలోని ప్రయివేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న ఆయనను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా రవి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నరని విమర్శించారు.పులిగిల్ల గ్రామానికి చెందిన రైతులకు వరికోలు గ్రామంలో టోకెన్లు ఇవ్వడమేంటి అక్కడ టోకెన్ తీసుకొని పరకాలలో సొసైటీలో యూరియా ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో యూరియా కోసం బయలుదేరిన రైతులను రోడ్డు ప్రమాదాలపాలై ప్రాణాలు కోల్పోతున్న మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటలకు తావులేదన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచిన ఘనత కేసిఆర్ దన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దని,ధైర్యంగా నిలబడి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కొట్లాడి యూరియా తెచ్చుకుందామని అన్నారు.మీకు అండగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. రైతులను గోసపెడుతున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని అన్నారు.పరకాల ఆర్టీసీ డీఎం,అగ్రికల్చర్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ప్రమాదంలో కాలువిరిగిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మహదేవపూర్ బాధిత కుటుంబాలను బీజేపీ నేతలు పరామర్శ…

బాధిత కుటుంబాలను పరామర్శించినబీజేపీ రాష్ట్ర నాయకులుచల్లనారాయణ రెడ్డి**

* మహదేవపూర్ సెప్టెంబర్ 13 (నేటి ధాత్రి *

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి రాంశెట్టి సమ్మయ్యని పరామర్శించి ప్రమాదంకు సంబదించిన పరిస్థితులను, వారి బాగోగులను అడిగి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అలాగే
గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో హాస్టల్స్ లో డైలీ వెజ్, కాoటినింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కరానికై చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం వెంటనే వర్కర్ల సమస్యల పరిష్కరానికి కృషి చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది,
మహాదేవపూర్ మండలంలోని అంబట్ పల్లి గ్రామంలో గురువారం గోదావరి తీరా ప్రాంతంలో పిడుగు పాటుకు మృతి చెందిన 94 గోర్లు, వాటి కాపరులను పరామర్శించి, అనంతరం మాట్లాడుతూ పశు సంబంధిత అధికారులు, కలెక్టర్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది,అలాగే 94 మృతి చెందిన గోర్లతో పాటు ఇంకో 30 గోర్లు కూడా చనిపోయే పరిస్థితి లో వున్నవి కాబట్టి వాటిని కూడా కలుపుకొని ఆర్థిక సహాయం చేయాలనీ, గొర్ల యొక్క విలువ మొత్తం 14 లక్షల నుంచి 15లక్షలు వరకు ఉంటుందని,కానీ ప్రభుత్వ సహాయం కింద గొర్రెకు 5000 వేలు నష్ట పరిహారం ఇస్తూ బాధిత కుటుంబలు 9 లక్షల వరకు నష్ట పోతుందని, ఆలా కాకుండా 14 లక్షలు అన్నిటి విలువ కట్టి ప్రభుత్వo ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు, అలాగె బీజేపీ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల శంకర్ శంకర్,లింగంపల్లి వంశీదర్ రావు,శ్రావణ్, బీజేపీ మండల నాయకులు ఆడప లక్ష్మి నారాయణ, కొక్కు శ్రీనివా స్, సాగర్ల రవీందర్, దాడిగేలా వెంకటేష్, రాకేష్, అయ్యప్పతో పాటు పలువురు పాల్గొన్నారు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T122009.181.wav?_=2

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: దైవ దర్శనానికి వెళ్తూ దుర్ఘటనకు గురైన కుటుంబంలో విషాదం నెలకొంది. జహీరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. పస్తాపూర్ ఆనంద్నగర్ కాలనికి చెందిన దండు వెంకటేశం (45), ఆయన అక్క కొడుకు సాయికుమార్ (20) ప్రాణాలు కోల్పోయారు. జహీరాబాద్ నుంచి న్యాల్కల్ మండలంలోని ముంగి ఆశ్రమానికి బయలుదేరిన ఈ కుటుంబం రైల్వే గేట్ దాటిన కాసేపటికే దుర్ఘటన చోటుచేసుకుంది.

 

బీదర్ నుంచి జహీరాబాద్ వస్తున్న లారీ అజాగ్రత్తగా అతివేగంగా దూసుకొచ్చి, ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన బలానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వెంకటేశం సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గాయపడిన వారు వరలక్ష్మి అలియాస్ భవాని (వెంకటేశం భార్య), నాగేశ్వరరావు (బావ), పిల్లలు రిషికేశ్, హరిచందన, జాన్వీ వీరు అందరూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

సంఘటన సమాచారం అందుకున్న వెంటనే సీఐ శివలింగం, ఎస్ఐలు నవీన్ కుమార్, కాశీనాథ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుని మృత్యువుతో పోరాడుతున్న సాయికుమార్ను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. అంబులెన్స్లో తరలిస్తుండగా అతను దుర్మరణం పాలయ్యాడు. ఇరుక్కున్న క్షతగాత్రులను తాళ్లు, ఇనుప రాడ్ల సహాయంతో బయటికి తీశారు. అనంతరం మృతదేహాలను పట్టణంలోని ఏరియా ఆసుపత్రి మార్చురికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T113732.763-1.wav?_=3

 

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మండల కేంద్రంలోని ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆవు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పశువుల యజమానులు వాటిని నిర్లక్ష్యంతో వదిలిపెట్టడం వల్ల రోడ్డుపైకి వచ్చి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అన్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ఆవుని గ్రామపంచాయతీ సిబ్బందితో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే తొలగించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు

తాను చనిపోతూ.. మరో ఏడుగురికి ప్రాణదానం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T105756.104.wav?_=4

తాను చనిపోతూ.. మరో ఏడుగురికి ప్రాణదానం

 

 

 

బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ యువకుడి అవయవ దానంతో ఏడుగురికి ప్రాణదానం చేశారు. జీవన్‌దాన్‌ వైద్యులు తెలినిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా జనప్రియ వెస్ట్‌ సిటీ, మియాపూర్‌కు చెందిన భువనగిరి కృష్ణ సుమంత్‌ (37) ప్రైవేట్‌ ఉద్యోగి.

 బ్రెయిన్‌డెడ్‌(Braindead)కు గురైన ఓ యువకుడి అవయవ దానంతో ఏడుగురికి ప్రాణదానం చేశారు. జీవన్‌దాన్‌ వైద్యులు తెలినిన వివరాల ప్రకారం రంగారెడ్డి(Rangareddy) జిల్లా జనప్రియ వెస్ట్‌ సిటీ, మియాపూర్‌కు చెందిన భువనగిరి కృష్ణ సుమంత్‌ (37) ప్రైవేట్‌ ఉద్యోగి. ఈనెల 18న ద్విచక్రవాహనంపై వెళుతూ బైక్‌పై నుంచి పడిపోయాడు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ సుమంత్‌ బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్టు వైద్యులు నిర్దారించారు.

జీవన్‌దాన్‌ ప్రతినిధులు అవయవ దానంపై ఆయన తండ్రి నరేందర్‌కు అవగాహన కల్పించడంతో ఆయన అందుకు అంగీకరించారు. కృష్ణ సుమంత్‌ శరీరం నుంచి 2 కిడ్నీలు, 2కార్నియాస్‌, లివర్‌, లంగ్‌, గుండె సేకరించి మరో ఏడుగురు వ్యక్తులకు అమర్చి వారికి ప్రాణదానం చేశారు.

ఆర్టీసీ బస్సు లారీ ఢీ 11 మందికి గాయాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29-7.wav?_=5

ఆర్టీసీ బస్సు లారీ ఢీ
11 మందికి గాయాలు

గాయాల పడిన వారిని ఆస్పత్రికి తరలింపు

శాయంపేట నేటిధాత్రి;

జాతీయ రహదారిపై బస్సు లారీ ఢీకొన్నాయి హనుమ కొండ వెళ్లే మార్గంలో కొత్త గట్టుసింగారం ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తు న్న11 మందికీ గాయాల పడ్డారు వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

RTC Bus Collides

ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ వల్ల ముందు డ్యామేజీని గ్రహించిన పోలీసులు భూపాలపల్లి రోడ్డు మార్గవాహనాల రాకపోకలను అంతరాయం ఏర్పడడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనములు రోడ్డు పక్కకు జరిపి వాహనాల రాకపోకలను పునరుద్ధరిం చారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అంజిరెడ్డి చేయూత

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-12T171702.643.wav?_=6

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అంజిరెడ్డి చేయూత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ సమీపంలో పస్తాపూర్ వద్ద ద్విచక్ర వాహనం లారీని ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అండగా నిలిచారు. ఆయన వెంటనే స్పందించి, ఆ యువకుడిని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సహాయక చర్యకు పలువురు ఆయనను అభినందించారు.

ఘోర ప్రమాదం.. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు

ఘోర ప్రమాదం.. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు

 

లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్ ఔటర్ రింగ్‌ రోడ్డుపై లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద అంబర్‌పేట్ నుంచి బోంగులూర్ వైపు వెళ్తుండగా ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అలాగే మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు మొయినబాద్ గ్రీన్ వాలీ రిసార్ట్‌లో పనిచేసే వారుగా గుర్తించారు. మలోత్ చందు లాల్(29), గగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు (40)తో పాటు మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version