వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.

వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి…

తంగళ్ళపల్లి నేటి రాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజులు గడుస్తున్న కాంట పెడతలేరు అంటూ. వడ్లు కొంట.లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వడ్లు కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందంటూ జిల్లెల్ల గ్రామంలో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన రైతులు. రైతులు ధర్నాకు దిగడంతో రోడ్డుపై భారీగా ఎక్కడికక్కడ వాహనాలు . నిలిచి. రాకపోకలకు ఇబ్బంది జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ .ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని. ఈ సందర్భంగా జిల్లాల గ్రామస్తులు తెలిపారు అలాగే. మండేపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు చేస్తలేరని రైతులు రోడ్డెక్కి. నిరసన తెలియజేస్తూ ధర్నాకు దిగారు. దయచేసి వెంటనే సంబంధిత అధికారులు మండలంలో ప్రతి గ్రామంలో వడ్ల. కొనుగోలు కేంద్రాల ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు ఉన్నతాధికారులకు విన్నవించారు ఇట్టి ధర్నా కార్యక్రమంలో జిల్లెల్ల గ్రామ ప్రజలు. రైతులు. మండపల్లి గ్రామ ప్రజలు. రైతులు. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత. పోలీసులు వెళ్లి ధర్నా చేస్తున్న వారిని . శాంతింప చేసి. సంబంధిత అధికారులతో మాట్లాడి వరి ధాన్యం. కొనుగోలు చేసే విధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోడ్డుపై వెళ్లే వాహనాలను . క్రమబద్ధకరించి. వాహనాలు సజావుగా పోయేటట్టు రాకపోకలకు అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు

ట్రాన్స్ ఫార్మర్ షాట్ సర్క్యూట్ తో వరిధాన్యం దగ్ధం.

ట్రాన్స్ ఫార్మర్ షాట్ సర్క్యూట్ తో వరిధాన్యం దగ్ధం..

వంద బస్తాల వరిధాన్యం దగ్ధం..1.5 లక్షల నష్టం.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

ప్రభుత్వం ఆదుకోవాలని రైతు బిక్షపతి విజ్ఞప్తి..

అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే వరిధాన్యం దగ్ధం

నర్సంపేట నేటిధాత్రి:

విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ కు షార్ట్ సర్క్యూట్ కావడంతో నోటి కాడికి వచ్చిన వరిధాన్యం దగ్ధమయింది ఈ సంఘటన నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రయ్య పల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు కుక్కముడి బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం యాసంగి వరి పంటకాలం పూర్తికాగా హార్వెస్టర్ సహాయంతో పంట కోత పూర్తి చేసినట్లు తెలిపారు. మరి ధాన్యాన్ని అమ్మకం కోసం సిద్ధంగా ఉంచగా పొలము సమీపంలో గల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ కు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యి పక్కనే ఉన్న గడ్డికి ద్వారా మంటలు వ్యాప్తించి వరిధాన్యం కాళీ దగ్ధమైందని రైతు బిక్షపతి ఆవేదన వ్యక్తం చేశారు.

short circuit

షార్ట్ సర్క్యూట్ కు అద్భుతమైన వరి ధాన్యం సుమారు 100 బస్తాలు ఉంటాయని చెప్పారు. అలాగే గడ్డికట్టలు, వ్యవసాయ పైపులు, కరెంటు వైర్లు కాలి బూడిద అయ్యాయని మొత్తం విలువ 1,50 వేలు ఆస్తినష్టం జరిగిందని రైతు బిక్షపతి వివరించారు. మా వరిధాన్యంతో పాటు మరికొందరు రైతుల గడ్డి అరుధాన్యం కూడా దద్దమయ్యాయని తెలిపారు. ఆరగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం ట్రాన్స్ఫార్మర్ తప్పిదం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి తనకు నష్టం వాటిల్లిందని కాగా ప్రభుత్వం నష్టపరిహారంగా ఆర్థిక సహాయాన్ని అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత రైతు కుక్కముడి బిక్షపతి ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

short circuit

షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి అగ్నిమాపక కేంద్రం అధికారులకు సమాచారం ఇవ్వగా సుమారు రెండు గంటల ఆలస్యంగా వచ్చారని అయినప్పటికీ పక్కనే ఉన్న చెరువులోని నీటితో గ్రామస్తులు రైతుల సహకారంతో మంటలు అదుపులోకి తెచ్చినట్లు రైతు బిక్షపతి తెలిపారు.ఈ సంఘటన పట్ల స్థానిక పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు బిక్షపతి తెలిపారు.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో జీవనజ్యోతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిఎం సివిల్ సప్లై చంద్రబోస్ ఎమ్మార్వో సునీత రెడ్డి ఎంపీడీవో సుభాష్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ వారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు అంబాల రవి వర్మ సీసీలు ప్రవీణ్ శ్రీనివాస్ బాపురావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రనిర్వహికులు జీవనజ్యోతి గ్రామైక్య సంఘ ఓబీలు మరియు ఎస్ హెచ్ జి సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపంచాయతీ కార్యదర్శి అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

వరి పంటను పరిశీలించిన అధికారులు.

వరి పంటను పరిశీలించిన అధికారులు

బాలానగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలలో వరి పంట నేలపై ఓరిగి నేలపై వరి గింజలు రాలాయి. సుమారు మండలంలో 300 ఎకరాలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బి.వెంకటేష్ శనివారం గౌతాపూర్ గ్రామంలోని దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సుజాత, మండల వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని

బీ ఆర్ ఎస్ అధ్యర్యములో రైతులు రాస్తా రోకో

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యర్యములో రైతులు వనపర్తి లో రాస్తా రోకో చేశారు రైతులకు అండగా ఉంటామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతులకు అండగా ఉంటామని చెప్పారు.
రాత్రి వనపర్తి జిల్లా లో కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను మార్కెట్ యార్డ్ లో పరిశీలించి ప్రభుత్వం ధాన్యాని కొనుగోలు చేసేవరకు పోరాడుతామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతుల కు ధైర్యం చెప్పారు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు వెంకట్రావ్,రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల క్రితం వచ్చిన వడ్లను సంచులు లేవని,ట్రాస్ఫోర్ట్ లేదని కొనుగోళ్లు చేయకపోవడం వడ్లు వర్షాల వల్ల నీటి పాలు అయినాయని ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు
ఈ యాసంగిలో 75లక్షల బస్తాలు మార్కెట్ యార్డ్ కు వస్తాయని అంచనా ఉన్నా పర్యవేక్షణ లేక రైతులను ప్రభుత్వం నట్టేట మంచిదని విమర్శించారు.
రైతులతో కలసి దాదాపు గంటసేపు రాస్తారోకో చేసి వాహనాలను స్తంభింపజేసి నిరసన తెలిపారు.రాస్తా రోకో దగ్గిరి కి వచ్చిన తహసీల్దార్ తడసిన వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,భానుప్రకాష్ రావు,మహేశ్వర్ రెడ్డి,ధర్మా నాయక్,నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్, గులాం ఖాదర్ ఖాన్, సూర్యవంశం.గిరి,ఇమ్రాన్, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి,చిట్యాల రాము బాబు నాయక్,పాషా,నారాయణ నాయక్,రైతులు పాల్గొన్నారు.

తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి.!

‘తరుగు లేకుండా..వరి ధాన్యం కొనుగోలు చేయాలి’

 

కల్వకుర్తి / నేటి ధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు మహబూబ్ నగర్ చౌరస్తాలో వరి ధాన్యం రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..

Farmers

వరి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారస్తులు ఒక బస్తాకు మూడు నాలుగు కేజీల తరుగుదల తీస్తున్నారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తే.. వ్యాపారస్తులు తమని మోసం చేస్తున్నారని వాపోయారు. ప్రజా పాలనలో ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులు.. తమకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. ‘జై జవాన్.. జై కిసాన్’ ‘తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి’ అంటూ.. రైతులు నినాదాలు చేశారు. రైతుల ధర్నాతో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. రైతు సంఘాల నాయకులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వివేకానంద గ్రామైక్య సంఘం నర్సక్కపల్లి, కనకదుర్గ గ్రామ ఐక్య సంఘం చర్లపల్లి, సోనియా గ్రామీక సంఘం నార్లాపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు,సిసి కుమారస్వామి,రైతులు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన భోగి పుష్ప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా చంద్రయ్యపల్లి మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ముందుగా కుటుంబ సభ్యులు కుమారులు వంశి,రాకేష్,అత్త లచ్చమ్మ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే అదే గ్రామానికి చెందిన తూముల సాంబయ్య,తూముల రాజు,చీర్లంచ వీరాచారి,,వరంగంటి కోమల్ రెడ్డి, పోలోజు పద్మ భూశబోయిన తిరుపతి 1500 నగదును అందించారు.ఈ కార్యక్రమంలో ఏడెల్లి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

మండలంలోని రాయపర్తి దుర్గభవాని గ్రామైక్య సంఘం, ముస్తాలపల్లి మారుతి ఐకేపి సెంటర్,రామకృష్ణాపూర్ మహేశ్వర గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు. ఈకార్యక్రమం లో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్లమలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సిసి కుమారస్వామి,మహిళా సంఘం సభ్యులు కావ్య, లక్ష్మి,రాధ,ప్రియాంక,రాణి, సుగుణ,చందన,ఎరుకల భారతి,పొన్నాల సునీత,యారా రజిత,పెళ్లి పద్మ, ఎరుకల సుకపాల,సిసి రాజు,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్.

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి చైతన్య గ్రామైక్య సంఘం,చౌటుపర్తి శ్రీ ఆంజనేయ గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300‌. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో ఏవో జైసింగ్,ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, సమన్వయ కమిటీ సభ్యులు పెద్దబోయిన రవీందర్ యాదవ్,ఈర్ల చిన్ని, బొల్లె బిక్షపతి,పిఏసిఎస్ సెంటర్ ఇంచార్జ్ పెండ్యాల మహేందర్ రెడ్డి,సీఈవో చోటా మియా, టాప్ ఆపరేటర్ పెగడ ఓం ప్రకాష్,సిసి కుమారస్వామి, మహిళా సంఘం సభ్యులు హరిత,స్వరూప,నవ్య శ్రీ, లక్ష్మి,మాధవి,ప్రసన్న,హైమ, రమ్య,తిరుమల,రైతులు తదితరులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300‌. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో మండల తహాసిల్దార్ గుండాల నాగరాజు, ఎంపీడీవో విమల,ఏఎం సీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఏవో జైసింగ్, పి డి‌. శ్రీనివాస్, డిపిఎం ప్రకాష్,ఏపీఎం రమాదేవి,మహిళా సమైక్య సభ్యులు వివోఏ గోనె‌ల కవిత,జంగిలి శిరీష, చెన్నబోయిన పవిత్ర,దుండి స్రవంతి,రావుల కావ్య.కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్, సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం మల్లారెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, పాడి ప్రతాప్ రెడ్డి,కోడెపాక కరుణాకర్,హమాలీలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు.

చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బి.వై నగర్ లోని చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ మాట్లాడుతు గత ప్రభుత్వహయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంతన్న హయాంలో పేద, ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగినది.

నేడు సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరూ కూడా వాళ్ల పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ కూడా కడుపునిండా భోజనం తింటున్నారని పేద ప్రజలందరి కళ్ళలో సంతోషం వ్యక్తం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ సామల రోజా సుధ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి కాజా పాల్గొన్నారు.

రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం.

రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

రైస్ మిల్లు అసోసియేషన్ ఎలక్షన్ ద్వారా ఎన్నికైన బీచని బాలకృష్ణ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం సోమవారం చేయడం జరిగినది. కార్యదర్శిగా పోల విజయకుమార్ కోశాధికారిగా యనుమగండ్ల రవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైస్మిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాబాలకృష్ణమాట్లాడుతూ డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

పేదలందరికీ సన్నబియ్యం అందించడమే.!

పేదలందరికీ సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం…
– దేశంలోనే సన్న బియ్యం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ
– కాంగ్రెస్ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాష్టకంగా: చేపట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని మొగుళ్లపల్లి మండలపరిధిలోని పాత ఇ స్సీ పేట గ్రామంలో జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు డీలర్ బొచ్చు లక్ష్మి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా తక్కల్లపల్లి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడీ ఇంటికి సన్నబియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా దారిద్రరేఖకు దిగువనున్న పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 2కోట్ల 61లక్షల మందికి పేదలకు తలకు ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. అందుకు 10600 కోట్లు కేటాయించింది అయినప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. .పేదలు దొడ్డు బియ్యం తినలేకపోవడం వలన పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం.
దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. రైతుల శ్రమ ఎక్కడికీ పోదు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశాం. 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించాం. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచిన గొప్ప ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సాహకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సన్న బియ్యం పంపిణీ.

సన్న బియ్యం పంపిణీ. 

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు ఆధ్వర్యంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా గౌడ్ ,రహీం, రజిని, పోచవ్వ, బాలవ్వ తదితరులు పాల్గొన్నారు

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం.!

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం. చౌకగా ప్రభుత్వ సన్నబియ్యం పేదలకు పంపిణి

ఎస్సి సేల్ మండల అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్

మొగులపల్లి ఏప్రిల్ 4 నేటి ధాత్రి

మండలంలోని ములకలపల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలతో. కాంగ్రెస్ పార్టీ మొగులపల్లి మండల కమిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్. రేషన్ షాపులో అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. చౌక ధరల దుకాణం నుండి చౌకగా పేదల ఇండ్లకు చేరిన సంపన్నుల సన్నబియ్యమని ఓనపాకాల ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో. చౌక ధరల దుకాణం ద్వారా నాసిరకం దొడ్డు బియ్యం సరఫరా జరిగేదని ఆ బియ్యాన్ని ప్రజలు ఎవరు కూడా తినేవారు కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల ద్వారా సన్న వడ్లను కొనుగోలు చేసి క్వింటాకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు రేషన్ కార్డు దారులు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి అన్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతుల వద్ద సన్న ధాన్యాన్ని 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించి రాష్ట్రంలోని చౌక దరల దుకాణం ద్వారా అర్హులైన వారికి 6 కిలోల చొప్పున1.81.686 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెల ప్రభుత్వం ద్వారా సరఫరా జరగనుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని రేషన్ డీలర్లు పౌరసరఫరాల రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో. సన్న బియ్యం సంక్షేమ పథకాన్ని విజయవంతం చేయాలని అధికారులను వేడుకున్నారు. సన్న బియ్యం పంపిణిలో డీలర్లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి.

రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణి

గంగారం, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగోండ్ల గ్రామం లో డీలర్ ఒక కొత్త ప్రచారం చేస్తున్నాడు రేషన్ షాప్ లో సన్నబియ్యం వచ్చాయని సాయంత్రం సమయంలో గ్రామం లో డప్పు సాటింపు చేపించి మరి బియ్యం పంపిణి చేస్తున్నారు ప్రజలు ఉదయమే రేషన్ షాపు కు వస్తున్నారని రేషన్ కార్డు లబ్ధిదారులందరికి సన్నబియ్యం పంపిణి చేయడం జరుగుతుందని..
అన్నారు,,,,

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం.

వర్ధన్నపేట మండలంలోని,కడారిగూడెం గ్రామ రేషన్ షాప్స్ నందు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన…వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుంది.

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం లేదు.

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం

–ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

వర్దన్నపేట (నేటిదాత్రి ):

 

 

 

ఈరోజు…వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సన్న బియ్యం పంపిణీని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…గౌరవనీయులు పెద్దలు వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వారు కల్పించిన అవకాశం మేరకు ఈరోజు కడారిగూడెంలో రేషన్ షాప్ నందు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్రంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు దేశంలోనే మొట్ట మొదటిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని తెలిపారు.

తెల్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని అలాగే పేద ప్రజల కడుపు నింపాలనే ఉద్దేశ్యంతో పేద ప్రజలకు రేషన్ షాప్ ల ద్వారా ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రత్మాకమని కొనియాడారు.

ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు.

ఇంత గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్చిపోకూడదని అన్నారు.

రాష్ట్ర ప్రజలందరి ఆదరణ, ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, సజావుగా సన్న బియ్యం పంపిణీ జరిగే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలని అధికారులను కోరుతున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పింగిలి రాజ్ మల్లారెడ్డి, నాయకులు, వంగాల రామచంద్రా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాంపెల్లి రవీందర్,కాంగ్రెస్ పార్టీ మహిళా మండల నాయకురాలు తీగల సునీత గౌడ్, కుందూరు యాకూబ్ రెడ్డి,ఏలపాటి పెద్ద తిరుపతి రెడ్డి కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణం 9వ వార్డు (సర్ధాపూర్, జెగ్గరావుపల్లె) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ గారు.

 

Ration shop.

బాలకీస్టాయ్య, యాదయ్యా,రాజనర్సు,కనకయ్య,రాములు,ఉపేందర్, షాధుల్, అంజయ్య, తిరుపతి, మోఫిక్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version