ప్రతీ ఉద్యోగి ఉద్యోగ విరమణ తప్పనిసరి…
డివైసీఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ప్రతి ఉద్యోగి తన జీవితంలో ఉద్యోగ విరమణ తప్పనిసరి అని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ అన్నారు. గురువారం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డివైసిఎంఓ గా విధులు నిర్వహించే డాక్టర్ జక్కుల ప్రభాకర్, స్వీపర్ గా విధులు నిర్వహించే గూడెపు పూలమ్మ లు ఉద్యోగ విరమణ పొందారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్మాన సభ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడారు. డాక్టర్ ప్రభాకర్ ఉద్యోగరీత్యా 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొందుతున్నారని, వారు వారి కుటుంబంతో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. స్వీపర్గా విధులు నిర్వహించే గూడెం పూలమ్మ 34 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారని ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీకాంత్, సంక్షేమ అధికారి ఎండి మాధార్ సాహెబ్, సూపరిండెంట్ కృష్ణమూర్తి , మ్యాట్రిన్ విజయలక్ష్మి, ఏఐటియుసి ఫిక్స్ సెక్రటరీ నాగేంద్ర భట్టు, వార్డ్ బాయ్స్, నర్సులు, ఉద్యోగులు, డాక్టర్లు పాల్గొన్నారు.