వనపర్తి ఏబీవీపీ 77వ గణతంత్ర దినోత్సవం తిరంగా ర్యాలీ నిర్వహణ

వనపర్తిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ లో విద్యార్థులు
వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీఆధ్వర్యంలో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవo సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహిం చసారు . ఈ ర్యాలీలో విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని త్రివర్ణ పతాకాలతో దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలి లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తీక్ మాట్లాడుతూ, 1950 జనవరి 26న భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరించి ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని గుర్తు చేశారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు, దేశం పట్ల ఉన్న విధులు, బాధ్యతలను గుర్తు చేసే దినమని తెలిపారు.
రాజ్యాంగ విలువలను పెంపొందించడమే ఏబీవీపీ ప్రధాన లక్ష్యమని, దేశ ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఏబీవీపీ నిరంతరం పోరాడుతోందని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులు కాలరాయబడినప్పుడు రాజీపడకుండా ప్రశ్నించడమే నిజమైన గణతంత్ర స్పూర్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ కన్వీనర్ జ్ఞానేశ్వర్, టౌన్ సంయుక్త కార్యదర్శి బంటి, శంకర్, నందకిషోర్, సంతోష్, పరమేష్, మురళి తదితర ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version