pranam thisina selfie sarda, ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా సెల్ఫీ సరదా ప్రాణాలను మింగేసింది. సరదాగా సెల్ఫీ కోసం చెరువులో దిగి బావ, ఇద్దరు మరదళ్లు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద చోటుచేసుకుంది. బొమ్మాపూర్‌ జలాశయంలో పడి ముగ్గురు మృతిచెందారు. మతులు అవినాశ్‌ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామస్థులుగా గుర్తించారు. ఫొటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ ముగ్గురూ జలాశయంలో పడిపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.