మార్క్సిజం మరియు సామాజిక మార్పు: ఎంసిపిఐ(యు) రాష్ట్ర శిక్షణ ప్రారంభం

సమాజ మార్పును శాస్త్రీయంగా వివరించేదే మార్క్సిజం

ఎంసిపిఐ(యు) రాష్ట్ర క్లాసుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట,నేటిధాత్రి:

 

సమాజ పరిణామ క్రమాన్ని శాస్త్రీయంగా అంచనా వేసిన ఏకైక సిద్ధాంతం మార్క్సిజమేనని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఆర్థిక అసమానతలు పెరగడానికి పెట్టుబడి దారి పాలకుల విధానాలే కారణమని అందుకు దోపిడీకి గురయ్యే శ్రామికులంతా ఐక్యంగా ప్రజా పోరాటాలను నిర్మించడమే ప్రత్యామ్నాయమని తెలిపారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) రాష్ట్రస్థాయి సైద్ధాంతిక రాజకీయ శిక్షణ తరగతులు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ వంగల రాగసుధ అధ్యక్షతన గిర్నిబావిలోని జి.ఆర్.బి కన్వెన్షన్ హాల్ లో ప్రారంభమయ్యాయి.అంతకుముందు పార్టీ జెండాను పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం జరిగిన శిక్షణా తరగతుల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ దేశంలో కుల మత ప్రాంత ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కొద్ది మంది దగ్గర అంతులేని సంపద పోగుపడుతున్నదని శ్రామికులు ఎంత శ్రమించినా కనీస అవసరాలు తీరడం లేదన్నారు. ఈ క్రమంలో దోపిడి పెరిగి ప్రజల మౌలిక సదుపాయాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తూ తాత్కాలిక ప్రలోభాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులతో కలిసి దోచుకు తింటున్నారని ఇలాంటి పరిస్థితులను మార్క్స్ ముందే అంచనా వేసి మార్క్సిజాన్ని రాసి సమాజానికి దిక్సూచిగా నిలిచాడని ఆయన చెప్పిన విధంగా పెట్టుబడిదారీ సమాజం తన గొయ్యిని తానే తవ్వుకుంటుందని అన్నట్లుగానే శ్రమ దోపిడీతో సంపదను పెంచుకుంటూ కష్టజీవుల కనీస అవసరాలు తీర్చకుండా నిరుద్యోగం దారిద్యం ఆకలి చావులు ఆత్మహత్యలు పెంచి పోషిస్తున్నారనివరోపించారు.ప్రజా ఉద్యమాలు బలపడకుండా అస్తిత్వ ఉద్యమాలను ప్రోత్సహిస్తూ నిర్బంధం ప్రయోగిస్తూ అధికార పబ్బం గడుపుతున్న.. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ పరిణామ క్రమాన్ని సరైన పద్ధతుల్లో అవగాహన చేసుకుని వర్గ సామాజిక ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎంసిపిఐ(యు) పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ..

పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 పార్టీ క్యాలెండర్ ను పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కోట నరసింహారెడ్డి,వల్లెపు ఉపేందర్ రెడ్డి, నాగేల్లి కొమురయ్యలతోపాటు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ రెడ్డి హంస రెడ్డి, కుంభం సుకన్య, తుకారాం నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, కనకం సంధ్య,తుడుం అనిల్ కుమార్, జబ్బర్ నాయక్, కర్ర రాజిరెడ్డి, గడ్డం నాగార్జున,మాస్ సావిత్రి, కర్ర దానయ్య,నర్ర ప్రతాప్, జిల్లా నాయకులు మాలోత్ సాగర్, చుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి లతోపాటు డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, మండల కార్యదర్శి సింగతి మల్లికార్జున్ లు కలిసి ఆవిష్కరించారు.
మొదటిరోజు క్లాసు మార్క్సిజం అధ్యయనం ఆచరణ ఓంకార్ పాత్ర అనే అంశంపై పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి బోధించారు.ఈ తరగతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version