గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను జిల్లా ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు, త్వరిత న్యాయం, పారదర్శక సేవలు అందేలా ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
అలాగే, శాంతి–భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
