యూరియా కోసం రైతులు అరిగోసలు పడుతున్న…

యూరియా కోసం రైతులు అరిగోసలు పడుతున్న పాటించుకొని ప్రభుత్వం

పంటలకు సరిపడా యూరియ అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతుని రాజుల చేసిన కేసిఆర్- సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులను చూసి ఆగిన చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఈసందర్భంగా రైతులు రవిశంకర్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పాస్ బుక్ మీద ఒక్క యూరియా బస్తానే ఇస్తాం అంటున్నారు మాకు ఐదు ఎకరాలు వ్యవసాయానికి ఒక్క బస్తా ఏం సరిపోతుంది అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్య విన్న రవిశంకర్ వెంటనే సంబంధింత అధికారికి ఫోన్ చేసి యూరియా కోసం తల్లడిల్లుతున్న రైతాంగం గురించి వివరించారు. వెంటనే వారికి యూరియా తెప్పించి రైతులకు అందించాలని కోరారు. అనంతరం రైతులతో ముచ్చటిస్తూ పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు చెప్పులను లైన్‌లో పెట్టి గంటల తరబడి నిరీక్షించారని, ప్రస్తుతం అదే పరిస్థితి ప్రతి చోటా కనిపిస్తుందన్నారు. అన్నదాతలు గత పదిరోజులుగా యూరియా కోసం ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసు పుస్తకం, ఆధార్‌కార్డుపై ఒక్క యూరియా బస్తానే ఇస్తుండడంతో ఐదెకరాలు, పదెకరాల భూమి ఉన్న రైతులకు అది ఏమూలకు సరిపోదని పేర్కొన్నారు. ఎకరాకు సుమారు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ఎరువు వేసే సమయంలో యూరియా లభించకుండా పంట దిగుబడిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఏఒక్కరోజు కూడా ఎరువుల కోసం ఇబ్బందిలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే ఈఅవస్థ అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎకరాకు కనీసం రెండు బస్తాల యూరియాను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే, మరోసారి రైతుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version