వాట్సాప్ హెచ్చరిక: డబ్బు దొంగిలించే కొత్త స్కామ్.. జాగ్రత్త!
◆:- ఎస్సై క్రాంతి కుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ మాట్లాడుతూ వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని, వారి ఆర్థిక సమాచారాన్ని దొంగిలించి, అనధికారిక లావాదేవీలు చేసే కొత్త మోసంపై వాట్సాప్ అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది. మోసగాళ్లు బ్యాంకులు, ప్రభుత్వ అధికారుల వేషంలో నమ్మిస్తూ, నకిలీ వెబ్సైట్లకు లింకులు పంపి, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు సేకరిస్తున్నారు. వాట్సాప్ ఎవరూ మెసేజ్ ద్వారా సున్నితమైన సమాచారం అడగరని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని, టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయాలని, అనుమానాస్పద మెసేజ్లను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలని సూచించారు.
