ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ.

నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లి గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సందర్భంగా.. నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూంలు ఇల్లు ఇస్తామని, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నామన్నారు. మొదటగా గుట్టలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు…

Read More

ఎల్వోసి అందజేసిన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి.

దేవరకద్ర /నేటి ధాత్రి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన డి. వంశీకుమార్ వైద్యం నిమిత్తం హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి సీఎం సహాయ నిధి ద్వారా.. రూ.2 లక్షల ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు అయ్యే ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందాలన్నారు.

Read More

మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం

‘విద్యా నిధికి.. విరాళాలు అందించండి’ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్/నేటి ధాత్రి బీఈడీ కళాశాలను అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. రూ. 2 లక్షలతో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా విద్యార్థులకు నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి వీలైనంతవరకు సౌకర్యాలు కల్పించాలని.. అది మనందరి బాధ్యత అన్నారు. కళాశాల అతి…

Read More

ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు కంటి అద్దాల పంపిణి

*నులిపురుగుల నివారణ మాత్రలు అందజేత.. *విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని హితవు. పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 10: పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాల మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ…. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే…

Read More

సోలార్ విద్యుత్ తో ఆదా…

ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తిరుప‌తి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08: ప్ర‌ధాన‌మంత్రి సూర్య ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై అవ‌గాహాన‌కు ఏపి ఎస్పీడీసిఎల్ సోలార్ కంపెనీల‌తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఆదివారం వ‌ర‌కు ఈ ఎగ్జిబిష‌న్ జ‌ర‌గ‌నుంది.సోలార్ కంపెనీలు ఏర్పాటు చేసిన సోలార్ ప్యాన‌ల్స్ ను అధికారుల‌తో క‌లిసి ఎమ్మెల్యే ప‌రిశీలించారు. 2024లో కేంద్ర ప్ర‌భుత్వం సూర్య ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కం…

Read More

చెన్నూరు వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే వివేక్

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా సందర్శించారు.నియోజకవర్గ పరిధిలో డయోరియా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రోజున చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించారు. రోగులను పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకొని, వారికి అందుతున్న వైద్యం పట్ల ఆరా తీశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు,సిబ్బంది…

Read More

సుద్దాల హనుమంతరావు జీవితం పేద ప్రజలకే అంకితమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో పాటయే ఆయుధం అయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన సుద్దాల హనుమంతు సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు కవిగా కళాకారుడిగా, వాగ్గేయకారుడిగా అంతకుమించి జీవితమంతా కష్టజీవుల కోసం అంకితం అంకితం చేశారన్నారు. తెలంగాణ జాతి యావత్తును…

Read More
error: Content is protected !!