జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి హరీష్ రెడ్డి..

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి హరీష్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 37 మంది జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ ఇంటి స్థలం ఇవ్వలేదు ఈ సందర్భంగా జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ నిరాహారదీక్షలకు మద్దతు తెలిపిన తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి
ఈ సంద్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమాజం లో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిస్టులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని..అధికారులకు ప్రజా ప్రతినిధులకు జర్నలిస్టులు రోడ్డెక్కుతుంటే కనపడడం లేదా అని ప్రశ్నించారు.. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చీకటి గణేష్ నరేష్ నేత పొక్కూరి శ్రీనాథ్ గాజుల అరుణ్ సందీప్ గౌడ్ ఆదిత్య వినయ్ పటేల్ ప్రదీప్ ముదిరాజ్ వినయ్, రాజకుమార్ తది తరులు పాల్గొన్నారు

జర్నలిస్టుల మహాధర్నా కు తరలి వెల్లిన ఐజేయూ నాయకులు..

జర్నలిస్టుల మహాధర్నా కు తరలి వెల్లిన ఐజేయూ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్నట్లు ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ రాష్ట్ర ఈసీ మెంబర్ ఏటా వీరభద్రరస్వామి,చిట్యాల ఐజేయూ ఇంఛార్జి రవితేజ,గణపురం ఐజేయూ ఇంచార్జి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version