జర్నలిస్టుల మహాధర్నా కు తరలి వెల్లిన ఐజేయూ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్నట్లు ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ రాష్ట్ర ఈసీ మెంబర్ ఏటా వీరభద్రరస్వామి,చిట్యాల ఐజేయూ ఇంఛార్జి రవితేజ,గణపురం ఐజేయూ ఇంచార్జి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
