june 1 nunchi kotha ration cardulu, జూన్‌ 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

జూన్‌ 1 నుంచి కొత్త రేషన్‌ కార్డులు తెలంగాణలో జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ వేగవంతం చేసింది. ఇందుకోసం రెండు కమిటీలను నియమించింది. కొత్తగా రేషన్‌కార్డులకోసం దరఖాస్తు చేసుకునేవారు, కొత్త పేర్లను చేర్చుకునేవారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.