చైన్‌ స్నాచర్‌ ఆటకట్టించిన వరంగల్‌ పోలీసులు.

చైన్‌ స్నాచర్‌ ఆటకట్టించిన వరంగల్‌ పోలీసులు.

*వరంగల్, నేటిధాత్రి

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా వారి మెడల్లో చైన్‌ స్నాచింగ్‌లతో పాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి సూమారు 23లక్షల 50వేల రూపాయల విలువ గల 237గ్రాముల బంగారు పుస్తెల తాళ్ళు, గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, పదివేల రూపాయల నగదు, ఒక సెల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police Commissionerate

ఈ అరెస్టుకు సంబందించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వివరాలను వెల్లడిస్తూ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్‌(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంటిలో నివాసం వుంటున్న నిందితుడు డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన ఓ సిమెంట్‌ కంపెనీలో క్వాలిటీ టెక్నిషన్‌గా హైదరాబాద్‌లో పనిచేసేవాడు ఇదే క్రమములో మొదటగా ఈ ఏడాది ఇదే సిమెంట్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సహోఉద్యోగి ఇంటిలో బంగారు గోలుసు చోరీకి పాల్పడి దానిని స్థానిక మణిప్పురం గోల్డ్‌ లోన్‌ కంపెనీలో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసేడు. ఈ సంఘటలో నిందితుడుని స్థానిక నెరెడ్‌మెట్‌ పోలీసులు ఈ ఏడాది అరెస్టు చేసిన జైలుకు తరలించారు.
బెయిల్‌పై విడుదలైన నిందితుడిలో ఏలాంటి మార్పు రాకపోగా తన జల్సాలకు అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా రొడ్డుపై వెళ్తున్న మహిళల మెడలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దామనుకున్న నిందితుడు ముందుగా చైన్‌ స్నాచింగ్‌ చేసేందుకు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వెళ్ళి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం పది చైన్‌ స్నాచింగ్‌లు, మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు, రాయపర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, అలాగే సుబేదారి, కాజీపేట,హసన్‌పర్తి, కమలాపూర్‌, కరీంనగర్‌ జిల్లాలోని చిగురుమామిడి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చైన్‌ స్నాచింగ్‌ చోరీలకు పాల్పడగా, హన్మకొండ, హసన్‌పర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిందితుడు మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడటం జరిగింది. ఈ వరుస చైన్‌ స్నాచింగ్‌ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్‌, హన్మకొండ ఏసిపిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుడుని గుర్తించిన పోలీసులు పక్కా సమచారంతో ఈ రోజు ఉదయం పోలీసులు ఉదయం యాదవ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద వాహన కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో చోరీ చేసిన బంగారు గొలుసులను విక్రయించేందుకు అనుమానస్పదంగా చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడుని రోడ్డుపై తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న నిందితుడుని పోలీసులు పట్టుకొని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు గొలుసును గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన చైన్‌ స్నాచింగ్‌, ద్విచక్ర వాహన చోరీలను అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతను నివాసం వుంటున్న అద్దె ఇంటి నుండి పోలీసులు మిగితా చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన క్రైమ్స్‌ డిసిపి గుణశేకర్‌, క్రైమ్స్‌ ఏసిపి సదయ్య, హన్మకొండ ఏసిపి నర్సింహరావు, కెయూసి, సిసిఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్‌, రాఘవేందర్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, సిసిఎస్‌ ఎస్‌.ఐ లు రాజ్‌కుమార్‌, శివకుమార్‌, హెడ్‌కానిస్టేబుళ్ళు అంజయ్య, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్‌, చంద్రశేకర్‌, రాములు, నగేష్‌లతో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

మేడ్చల్‌లో గర్భిణీ భార్యను దారుణంగా హత్య చేశారు.

 గర్భవతని చూడకుండా.. రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి.. మేడిపల్లిలో భర్త దారుణం..

 

నువ్వే నా ప్రాణం.. సర్వస్వమని మాయమాటలు పెళ్లి చేసుకున్న అతడు.. కొన్నేళ్లకే అసలు రూపం బయటపెట్టుకున్నాడు. గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన అందరి హృదయాలనూ కలచి వేస్తోంది.

మేడ్చల్ జిల్లా, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా జరిగిన అమానవీయ ఘటన అంతటా కలకలం రేపుతోంది. మేడిపల్లి పరిధిలోని బాలాజీహిల్స్ కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తి గర్భిణీ అయిన భార్యను అతి క్రూరంగా హతమార్చిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. రంపంతో భార్యను ముక్కలు ముక్కలుగా కోసి శరీర భాగాలను మూసీ నదిలో పడేశాడు. ఇరువురి మధ్య కొన్నాళ్లుగా చెలరేగుతున్న కలహాలే హత్య దారి తీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన ఈ దంపతులు కొన్నాళ్ల కిందటే హైదరాబాద్‌లోని బోడుప్పల్ ప్రాంతానికి వలస వచ్చారు.

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (వయస్సు 25), మహేందర్ రెడ్డి ఇరువురూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌ వచ్చి నెల కూడా అవలేదు. మహేందర్ ర్యాపిడో నడుపుతుంటాడు. అయితే, కొంతకాలంగా దంపతులు ఇరువురూ తరచూ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం (ఆగస్ట్ 22) మధ్యాహ్న సమయంలో ఐదు నెలల గర్భవతిగా స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి అత్యంత దారుణంగా హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కవర్లలో పెట్టి వాటిని మూసీ నదిలో పడేసే ప్రయత్నం చేశాడు. తల, చేతులు, కాళ్లు వేరు చేసి విభిన్న ప్రాంతాల్లో వదిలిపెట్టినట్లు అతడు అంగీకరించినట్టు తెలుస్తోంది. మొండాన్ని మాత్రం ఇంట్లోనే ఉంచడంతో దుర్వాసన వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కవర్లను పరిశీలించగా మహేందర్ ఇంట్లో స్వాతి మొండెం కనిపించింది. దీంతో నిందితుడు మహేందర్ రెడ్డి పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.

స్వాతి తల్లి మీడియాతో మాట్లాడుతూ, తమ కూతురు డిగ్రీ చదువుతున్న సమయంలో మాయమాటలతో ఆకర్షించి మహేందర్ ఇంట్లోంచి తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపింది. మాట వినకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత బంగారం కూడా ఇచ్చామంది. కానీ పెళ్లి తర్వాత మహేందర్ పూర్తిగా మారిపోయాడని.. నా కూతుర్ని చిత్రహింసలు పెట్టేవాడని.. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదంటూ కన్నీటిపర్యంతమైంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ హత్య పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన శరీర భాగాల కోసం మూసీ నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనతో ప్రేమ వివాహాలు, గృహహింస, మహిళల భద్రత అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రేమ పేరుతో జరిగే పెళ్లిళ్లు, అనంతరం వెలుగు చూస్తున్న హింసాత్మక సంఘటనలు సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. 

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల అస్వస్థపై అనుమానం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T123331.092-1.wav?_=1

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల అస్వస్థపై అనుమానం

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి సుభాష్ కాలనీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు మంచినీరు తాగి అస్వస్థకు గురయ్యారు దీనిపైన జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అధికారులను డిమాండ్ చేశారు
భూపాలపల్లి సుభాష్ కాలనీ గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 13 మంది విద్యార్థులు ఆహారం తిని వాటర్ తాగి అస్వస్థకు గురైన విద్యార్థులను స్థానిక ప్రిన్సిపాల్ వెంటనే 100 పడకల హాస్పిటల్ తరలించి వైద్యం అందించారు కానీ ఘటన జరిగిన దాని యొక్క కారణాలు ఏమున్నాయి ఎవరు చేశారు అనేదానిపై విచారణ జరిపించి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం బాధ్యులు ఎంతటి వారైనా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా సెక్రెటరీ శీలపాక నరేష్ పార్టీ నాయకులు రాజు పాల్గొన్నారు

తల్లిని అత్యాచారం చేసిన ఢిల్లీ వ్యక్తి అరెస్టు..

ఢిల్లీలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. 39 ఏళ్ల మద్ ఫిరోజ్, అలియాస్ సుహెల్, తన తల్లిని అత్యాచారం చేసిన ఆరోపణలతో అరెస్టు అయ్యాడు. తల్లి ఇటీవల సౌదీ అరేబియాకు యాత్ర చేసి తిరిగి వచ్చారు. అతను ఆమెను ఒక గదిలో లాక్ చేసి, చాకూ మరియు కత్తులతో కొట్టడం తో పాటు గత conduct కోసం శిక్షగా అత్యాచారం చేశాడని ఆరోపణ. భయంతో ఆమె మొదట పోలీసులు దగ్గరకు వెళ్లలేదు, కానీ తర్వాత ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హద్నూర్ లో మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T125406.062.wav?_=2

 

హద్నూర్ లో మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమి దొడ్డి అశోక్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, బీహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మన్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఐదు నెలలుగా బీదర్ లో పని చేసుకుంటున్న లక్ష్మన్, కూలీ డబ్బులు సరిపోక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో ఐదేండ్ల జైలుశిక్ష,

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T140151.084.wav?_=3

 

మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో ఐదేండ్ల జైలుశిక్ష,

జహీరాబాద్,నేటిధాత్రి:

 

మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా స్పెషల్ పోక్సో జడ్జి జయంతి విధించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కథనం ప్రకారం సంగారెడి జిల్లా జహీరాబాద్ మండలం మధులై తండాకు చెందిన రాథోడ్ సంజీవ్ అదే తండాకు చేసిన మైనర్ బాలిక ఇంటివద్ద ఒంటరిగా ఉండగా బాలికపై కన్నేసిన రాథోడ్ సంజీవ్ 2020 జులై 7 న ఇంట్లోకి తీసుకెళ్ళాడు.అరుస్తే చంపుతా అని బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడగా వెంటనే బాలిక అరుపులకు చుట్టుపక్కల వారు వస్తున్నారని గ్రహించి పారిపోయాడు.తల్లిదండ్రుల ఫిర్యాదుతో నాటి ఎస్సై కె.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

నిందితుని శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.ఎస్ ఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం. నేరం సంఖ్య: 51/2020- సెక్షన్ 354,ఎ 448,506,, ఐ పి సీ సెక్షన్ 7 %తీ/ష% బి ఆఫ్ పోక్సో యాక్ట్ 2012, చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్. వివరాలలోనికి వెళ్లితే: చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో హిర్యాధి కూతురు వయస్సు 14 సంవత్సరాలు తేదీ 07.07.2020 నాడు మద్యాహ్నం సమయంలో తమ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలిక పై, అదే తండ కు చెందినా నిందితుడు రాథోడ్ సంజీవ్ అక్రమంగా బాలిక ఇంటిలోకి పోయి అసభ్యంగా ప్రవర్తించి, ఆమె చేయి పట్టుకుని బలవంతంగా తనతో లైంగిక కోరిక తీర్చమని బలవంత పెట్టగ, మైనర్ బాలిక భయపడి అల్లరి చేయగా నిందితుడు ఆమెను భయపెట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి పారిపొయినాడు, అట్టి వ్యక్తిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ లో దరఖాస్తు చేయగా అప్పటి యస్.హెచ్.ఒ కె గణేష్ ఎస్. ఐ కేసు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ అనంతరం న్యాయ స్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేయగా, కేసు పూర్వపరాలను విన్న స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి జయంతి నిందితుడు రాథోడ్ సంజీవ్ కు 5-సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ: 10000/-జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుని వివరాలు: రాథోడ్ సంజీవ్ తండ్రి భీమ్ సింగ్, వయస్సు: 30 సంవత్సరాలు, వృతి: కూలిపని, కులం: ఎస్టీ (లంబాడ), నివాసం మధులై తండా, మండలం జహీరాబాద్ జిల్లా సంగారెడి. నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్ రెడ్డి, ఇన్వెస్టిగేషన్ అధికారికె గణేష్ ఎస్. ఐ, ప్రస్తుత ఎస్. ఐ. రాజేందర్ రెడ్డి, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ కృష్ణ, కోర్ట్ లైజనింగ్ అధికారి హెడ్. కానిస్టేబుల్ శంకర్, కె. సత్యనారాయణ ఎస్ఐఐ. లను ఎస్పీ అభినందించారు.

బెట్టింగ్ యాప్ కేసులో రైనా ED ఎదుట..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-27-3.wav?_=4

బెట్టింగ్ యాప్ కేసులో రైనా ED ఎదుట

న్యూ ఢిల్లీ, ఆగస్టు 13:నేటిధాత్రి 


భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, అక్రమ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బుధవారం (ఆగస్టు 13, 2025) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరయ్యారు. అధికారిక సమాచారం ప్రకారం, 1xBet అనే యాప్‌తో రైనా కొంత ప్రమోషన్, ఎండార్స్‌మెంట్ లింకులు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ కేసులో ఆయనను ప్రశ్నించడానికి ED సమన్లు జారీ చేసింది.

రైనా వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అధికార సంస్థ ప్రక్రియను కొనసాగించనుంది. ప్రస్తుతం ED అనేక అక్రమ బెట్టింగ్ యాప్ కేసులను దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్‌ల ద్వారా కోట్ల రూపాయల మోసం, పన్ను ఎగవేత జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.

ముగిసిన ‘ఆడుదాం ఆంధ్ర’ స్కామ్ విచారణ.

ముగిసిన ‘ఆడుదాం ఆంధ్ర’ స్కామ్ విచారణ
AP: గత ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో జరిగిన స్కామ్‌పై విచారణ ముగిసింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును త్వరలో విజిలెన్స్ అధికారులు డీజీపీకి సమర్పించనున్నారు. కాగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్స్, ఈవెంట్స్ పేరిట అవినీతి జరిగిందనే ఆరోపణలతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

నేరాల విచారణలో ఆధారమయ్యే శాస్త్రీయ

నేరాల విచారణలో ఆధారమయ్యే శాస్త్రీయ పరిజ్ఞానం ఎంతో అవసరం

ఆధునిక ఫోరెన్సిక్ పద్దుతులు వినియోగించడం ద్వారా నేరాలను సమర్ధవంతంగా పరిష్కరించవచ్చు

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐ.పీ.ఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేరాల విచారణలో శాస్త్రీయ ఆధారాలు,ఆధునిక ఫోరెన్సిక్ పద్ధతుల వినియోగం కీలకమని జిల్లా ఎస్పీ తెలిపారు.నేర సంఘటన స్థలంలో ఆధారాల సేకరణ,భద్రత లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కేసుల దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. నేర పరిశోధనలో ఆధునిక
సాంకేతికత ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో,కేసుల విచారణలో ఆధారాలను సైన్స్ పరంగా విశ్లేషించడానికి ఫోరెన్సిక్ శిక్షణ ఎంతో అవసరమని అందులో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో మెడికల్ కళశాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో జిల్లాలోని ఇన్వెస్టిగేషన్ అధికారులకు,స్టేషన్ రైటర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

 

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఆధునిక శాస్త్రీయ విధానాల ద్వారా నేరాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ మరింత ప్రావీణ్యంతో ముందుకు సాగుతోందని,నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో,కేసుల విచారణలో ఆధారాలను సైన్స్ పరంగా విశ్లేషించడానికి ఫోరెన్సిక్ శిక్షణ ఎంతో అవసరమన్నారు.ఇలాంటి శిక్షణల ద్వారా కేసుల విచారణలో మరింత నిష్ణాతులుగా తయారయ్యేలా పోలీస్ అధికారులకు,సిబ్బందికి దోహదపడతాయన్నారు.హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు మొదలగు నేర సంఘటనలో ఆధారాలు ఏ విధంగా సేకరించాలి, ఏ ఏ ఆధారాలు సేకరించాలి,ఏ విధంగా భద్రపరచాలి,ఫోరెన్సిక్ ల్యాబరేటరికి ఎం ఎం పంపించాలనె అంశాలపై ఇన్వెస్టిగేషన్ అధికారులకు,స్టేషన్ రైటర్లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
జిల్లా పోలీస్ అధికారులకు,సిబ్బందికి
ఫోరెన్సిక్ సైన్స్ పై అవగాహన కల్పించిన మెడికల్ కళశాల వైద్య బృందాన్ని అభినందించి మెమోంటోస్ అందించిన జిల్లా ఎస్పీ. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వరి, వైస్ ప్రెసిపల్ డా. లక్ష్మీ నారాయణ,డా. నిర్విష హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ మెడిసిన్, డా. వినేయ్ మరియు కళాశాల ప్రొఫెసర్లు,
డాక్టర్లు,సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్, ఎస్.ఐ లు అన్ని పోలీస్ స్టేషన్ల రైటర్స్ పాల్గొన్నారు.

స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి.

స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి

అవినీతికి కారణమైన మాజీ మేయర్ సునీల్ రావు ఆస్తులపై ఏసీబీ దాడులు చేయాల -సిపిఐ

కరీంనగర్, నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-12.wav?_=5

కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని, మాజీ మేయర్ సునీల్ రావు అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణచేయాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో కోట్ల రూపాయల నిధులతో జరిగిన స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు రాజ్యమేలాయని దీనిని పట్టించుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మేయర్ సునీల్ రావు కొందరు బినామీ కాంట్రాక్టర్లను ఏర్పరచుకొని ఇష్టం వచ్చిన రీతిలో స్మార్ట్ సిటీ పనులలో అవినీతి అక్రమాలు ప్రోత్సహించాడని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్ పాతుల నిర్మాణం, జంక్షన్ల సుందరీకరణ, పార్కుల నిర్మాణం, రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలలో పూర్తిగా అవినీతి అక్రమాలు జరగాయని అధికారులు రాజకీయ నాయకులు ఒక్కటై కరీంనగర్ నగరాన్ని దోచుకున్నారని విమర్శించారు.
సంవత్సరం కాకముందే ఫుట్ పాతుల టైల్స్ దెబ్బతిన్నాయని, రోడ్లు పగళ్ళు వచ్చాయని కాంట్రాక్టర్ పూర్తిగా నాణ్యత పాటించకపోవడం కాంట్రాక్టర్ కి వత్తాసు పలకడం వల్ల అవినీతి రాజ్యమేలిందని వెంటనే స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతి పై విచారణ జరిపి కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు మేయర్ గా కొనసాగిన సునీల్ రావు స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని మేయర్ పదవి పోయిన తర్వాత గుర్తుకు రావడం సిగ్గుచేటని సునీల్ రావు మాటలు వింటుంటే దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరించడం సరైంది కాదనిఆరోపించారు. సునీల్ రావుకు కరీంనగర్ నగరంలో బహుళ అంతస్తుల భవనం, విదేశాల్లో భవంతులు ఏవిధంగా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. సునీల్ రావుకు చిత్తశుద్ధి ఉంటే తను కౌన్సిలర్ గా పోటీ చేసిన సమయంలో ఎన్నికల అపిడవిట్లో పెట్టిన ఆస్తుల వివరాలు ఇప్పుడు తన ఆస్తుల వివరాలు ప్రజలకు వివరించి తన చిత్త శుద్ధి నిరూపించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి, సునీల్ రావు అక్రమాలపై విచారణ చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని సురేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈధర్నాలొ సిపిఐ నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్,బీర్ల పద్మ, కొట్టి అంజలి, మచ్చ రమేష్, ఆర్ వెంకటేష్ నగర కార్యవర్గ సభ్యులు గామినేని సత్యం, కె.సంతోష్ చారి, చంచల మురళి, నగునూరి రమేష్, ఎలిశెట్టి భారతి, చారి, రాము, సాంబరాజు, బెక్కంటి రమేష్, లక్ష్మీ,రజిత, సుజాత, రమ, సందీప్ రెడ్డి, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం చాలా దురదృష్టకరం

మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ

“నేటిధాత్రి”,పటాన్ చెరు / సంగారెడ్డి జిల్లా:

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ అన్నారు. మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏమిటనే అంశంపై పూర్తి విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇంకా 13 మంది మృతదేహాల అచూకీ వెంటనే కనుగొనడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి ఇండస్ట్రియల్స్ ను రద్దు చేయాలని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం మరియు సిగాచి రసాయనిక పరిశ్రమ యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సిగాసి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

సిగాసి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారంలోని సిగాసి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం అనేకమంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని ఐఎఫ్ టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పనిలో ఉన్నారని వారి రక్షణకై యుద్ధప్రాతిపదికపై మరింతగా అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని,

ఈ దుర్ఘటనలో లేబర్ అధికారుల,ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైందని పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ లేకపోవడం వలన జరిగిందని ఐఎఫ్టియు అభిప్రాయపడుతుందని తెలిపారు.

 

General Secretary M Srinivas

 

మరణించిన క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి,బిఎన్ఎస్ఎస్
సెక్షన్ 106 లేదా సెక్షన్ 107 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని .

మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని, తీవ్రంగా క్షతగాత్రులైన కార్మికులకు ఒకరికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ స్థాయి లో వైద్యాన్ని ప్రభుత్వ పరివేక్షణలో యాజమాన్యం మరియు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారు( కార్మికులు) సంపూర్ణంగా కోరుకునే వరకు అందించాలని రాష్ట్ర కమిటీ తరుపున కోరారు.

ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నట్లు ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ ప్రకటించారు.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

*యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ *

నర్సంపేట నేటిధాత్రి:

 

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఎంఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి.
నర్సంపేటలో ఐక్య విద్యార్థి సంఘాలు సమావేశంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగిలిచర్ల సందీప్,పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముక రవి.ఎంఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్ధూ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాధికారులు విఫలమయ్యారన్నారు. విద్యాధికారులు ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఇచ్చే మాముళ్ళకు అలవాటు పడి వాటిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా వారికి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. విద్యకు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని ఉన్న వాటిని అమలు చేయడంలో విద్యాధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు బుక్స్ , డ్రెస్సుల పేరుతో వేల రూపాయలను వసూలు చేస్తూ విద్యా కేంద్రాల్లో షాపులు పెట్టి మరి నడుపుతున్న అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు స్వాతిక,కీర్తన,అలేఖ్య,సిద్దు,ప్రభాస్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి.

అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి
భూభారతి కార్యక్రమంలో బాధితుల గోడు
రోడ్డుపై బాధితులుప్లెక్సీలు పట్టుకొని రాస్తారోకో
జమ్మికుంట :నేటిధాత్రి

 

shine junior college

 

 

జమ్మికుంట మండలంలోని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య అక్రమంగా భూకబ్జాలు చేస్తూ మోకా మీద లేకున్నా గత ఎమ్మార్వో నారాయణ తో చేతులు కలిపి దాదాపు 20 ఎకరాల భూమి దొంగ 13b సాదా భయానామాలు పుట్టించి అతని పేరున ధరణి కాలంలో కొత్త పాస్ బుక్కులు తీసుకు రావడం జరిగింది అలాగే కొంతమంది బినామీ పేర్ల పైన కొత్త పాసు బుక్కు ఉండంగా కూడా వాళ్లు వేలిముద్ర వేయకుండా వాళ్ల సంతకాలు పెట్టకుండా వేరే వాళ్లకు మార్పు చేయించినాడు తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఆట స్థలాన్ని కూడా వదిలిపెట్టలేదు ఇట్టి పోరుపై చాలాసార్లు కలెక్టర్ను ఆర్డీవోను ఎమ్మార్వో మారినప్పుడల్లా మా బాధలను వినిపిస్తున్నాము ఈ అక్రమార్కుని పై పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈరోజు భూభారతి కార్యక్రమం గ్రామపంచాయతీ ఆవరణలో జరుగుతుందని తెలుసుకుని బాధితులంతా రోడ్డుపై ఫ్లెక్సీ పట్టుకొని నిరసన తెలిపినారు తర్వాత అధికారులకు వారి యొక్క వినతి పత్రాలు అందజేసినారు ఇకనైనా ఈ భూభారతి లోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోనైనా మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు కనుక అధికారులు గమనించి సమగ్ర విచారణ జరిపి పేదల భూములు వారి వారికి పాసుబుక్కులు ఇప్పించాలని బాధితులంతా కోరుకోవడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version