అద్భుతమైన విజయకేతనం

అద్భుతమైన విజయకేతనం

శ్రీ వివేకవర్ధిని విద్యార్థుల ప్రతిభ

కేసముద్రం/ నేటి ధాత్రి

 

విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు.
పాఠశాల విద్యార్థి బీరెల్లి ఓం సాయి 576 మార్కులు సాధించి మండల స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు.
సముద్రాల లోకేష్ 564 మార్కులు, బొల్లు సాయి అక్షిత్ 561 మార్కులు, సముద్రాల రక్షిత 560 మార్కులు, కుంసోతు గౌతం 557 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబర్చారు.

ఈ ఏడాది పాఠశాల నుంచి మొత్తం 91 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 44 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించడం ప్రత్యేకతగా నిలిచింది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయానికి కారణమని కరెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు

ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్, ప్రిన్సిపల్ చిర్ర నరేష్ అభినందించి, సన్మానించారు. విద్యార్థులు ఇలాగే మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version