హజ్రత్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ దర్గా 767వ జాతర

దర్గా హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ 767 ఉత్సవాలు ఘనంగా జరిగాయి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండల్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహీర్ దక్కన్ 767 దర్గా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. దర్గాకు గంధం, స్వీట్లు, పండ్లు, చెద్ధర్ కప్పి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించారు. పీర్ల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, దువాలు నిర్వహించగా, సమస్త ప్రజల శాంతి, అభ్యుదయానికి ప్రార్థనలు చేశారు.
జాతర సందర్భంగా దర్గా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అన్నదాన కార్యక్రమం, నీరు, వైద్య శిబిరం వంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై చేరి ఈ పుణ్యోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.
భక్తి, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ జాతర శోభాయమానంగా సాగింది. ✨
ఈ కార్యక్రమంలో దర్గా వారసులు గఫ్ఫర్ బై,, మొహమ్మద్ వజీర్ అలీ ,,మహమ్మద్ ఇమ్రాన్,, అబ్దుల్ సత్తార్ నిజాయితీ మహమూద్ రహీం పెద్దగుళ్ల నారాయణ మాదినం శివప్రసాద్ కొండాపురం నరసింహులు మాజీ సర్పంచ్ బీ వీరేశం ప్యార్ల దశరథ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version