gudiselu veinchi…beram kudurchuco…,గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో…
గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో… నిలువ నీడలేని పేదలను కొందరిని చేరదీస్తారు. చెప్పింది వినాలంటారు. ప్రభుత్వభూమినో, ప్రైవేటు భూమినో చూపిస్తారు. ఇందులో మీకు జాగ ఖాయం అంటారు. దీనిని చదును చేస్తే మనం గుడిసెలు వేసుకోవచ్చని నమ్మకంగా చెప్తారు. నిలువ నీడ దొరుకుతుంది. నగరంలో ఓ ఇల్లు కట్టుకోవచ్చని పేదలు చెప్పిన ప్రతీ దానికి తలలూపుతారు. మరీ భూమిని చదును చేయాలి, జెండాలు పాతాలి, పోలీసులను ఎదుర్కొవాలి. ఇదంతా చేయాలంటే ముందుగా చేతిలో ఎంతో కొంత పైకం ఉండాలి….