3, 750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యం’
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ మెగడంపల్లి మండలం గోడిగారిపల్లిలో శనివారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామయిల్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ఉద్యాన అధికారి పండరి, ఏవో హన్మద్దీన్, ఏఈవో సరస్వతి, అయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పామయిల్ పంట ప్రాధాన్యత, మెరుగైన సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీ పథకాల గురించి అధికారులు రైతులకు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో 3,750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
