endalo jagratha, ఎండలో జాగ్రత్త

ఎండలో జాగ్రత్త జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రకటన జారి చేసారు. మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎండ వేడిమి అధికంగా ఉండడంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బకు వద్ధులు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కువగా గురి అవుతున్నారని…