అగ్నిమాపక సేవల వారోత్సవం ఘన ముగింపు

అగ్నిమాపక సేవల వారోత్సవం ఘన ముగింపు

 

పరకాల,నేటిధాత్రి

ప్రాంతంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించిన అగ్నిమాపక సేవల వారోత్సవం సోమవారం విజయవంతంగా ముగిసింది.అగ్ని ప్రమాదాల నివారణ,అప్రమత్తత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవం ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు.ముగింపు కార్యక్రమానికి సంతోష్ నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ డా.సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.అగ్ని ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన ఎంతో కీలకమని,ప్రాథమిక చికిత్సపై అవగాహన ఉండటం ద్వారా ప్రాణనష్టం తగ్గించవచ్చని ఆయన తెలిపారు.ప్రజల్లో చైతన్యం పెంచడంలో అగ్నిమాపక శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు.వారోత్సవంలో భాగంగా ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ప్రారంభ దినాన ర్యాలీలు,ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టగా,తరువాతి రోజుల్లో పర్కల్ బస్ స్టాండ్,సాగర వీధి వంటి ప్రాంతాల్లో ప్రజలకు అగ్ని భద్రతపై సూచనలు అందించారు.

సంతోష్ నర్సింగ్ హోమ్ మరియు వినూత్న న్యూరో & జనరల్ హాస్పిటల్‌లలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా, శ్రీ బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు.జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను ప్రదర్శించారు.ముగింపు రోజున సన్మానాలు నిర్వహించి కార్యక్రమాన్ని ముగించారు.అగ్ని ప్రమాదాల సమయంలో వెంటనే 8712699306 నంబర్ ద్వారా అగ్నిమాపక అత్యవసర సేవలను సంప్రదించాలని అధికారులు సూచించారు.ఈ వారోత్సవం ద్వారా ప్రజల్లో అగ్ని భద్రతపై అవగాహన మరింత పెరిగినట్లు అధికారులు తెలిపారు.

అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యం

అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యం

వి.భద్రయ్య స్టేషన్ ఫైర్ ఆఫీసర్

పెట్రోల్ బంకుల్లో అవగాహన కార్యక్రమం

పరకాల,నేటిధాత్రి

 

అగ్నిప్రమాదంలో వీరమరణం పొందిన 66 మంది అగ్నిమాపక సిబ్బంది స్మృతార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా పట్టణంలోని శ్రీ బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్‌లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వి.భద్రయ్య ఆధ్వర్యంలో కరపత్రాలు,పోస్టర్లు పంపిణీ చేసి,అగ్నిప్రమాద నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.పాఠశాలలు, కార్యాలయాలు,వ్యాపార సంస్థలు,గ్రామీణ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్,సదస్సులు నిర్వహిస్తూ విద్యుత్ భద్రత, ఎల్‌పీజీ వాడకం,గ్యాస్ లీకేజీ నివారణ,అగ్ని సమయంలో పాటించాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని భద్రయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎఫ్.కృష్ణకుమార్, G. గణేష్ ఎఫ్ఎఫ్టి,ఎఫ్ఎఫ్ లు దిలీప్,రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

షైన్ హై స్కూల్ లో అగ్నిమాపక అవగాహన సదస్సు..

షైన్ హై స్కూల్ లో అగ్నిమాపక అవగాహన సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు షైన్ హై స్కూల్ లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్నిమాపక జిల్లా అధికారి రవి పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఇంట్లో లేదా బయట ఎక్కడైనా మంటలు చెలరేగినప్పుడు ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మంటలను ఎలా ఆర్పాలి అనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు జిల్లా ఫైర్ అధికారి రవి వివరించారు.
అగ్ని ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఏమిటి, అలాంటి సమయంలో భయపడకుండా ఎలా స్పందించాలి అనే అంశాలను ప్రత్యక్షంగా డెమో ప్రదర్శన చేసి చూపించారు.
విద్యార్థులకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది అరుణ్ కుమార్, నరేందర్, సురేష్ ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version