షైన్ హై స్కూల్ లో అగ్నిమాపక అవగాహన సదస్సు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు షైన్ హై స్కూల్ లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్నిమాపక జిల్లా అధికారి రవి పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఇంట్లో లేదా బయట ఎక్కడైనా మంటలు చెలరేగినప్పుడు ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మంటలను ఎలా ఆర్పాలి అనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు జిల్లా ఫైర్ అధికారి రవి వివరించారు.
అగ్ని ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఏమిటి, అలాంటి సమయంలో భయపడకుండా ఎలా స్పందించాలి అనే అంశాలను ప్రత్యక్షంగా డెమో ప్రదర్శన చేసి చూపించారు.
విద్యార్థులకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది అరుణ్ కుమార్, నరేందర్, సురేష్ ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.
