ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు

 

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. ఎల్లుండి నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది.

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. ఎల్లుండి నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. ఈనెల 6 నుంచి ఈ కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. 6వ తేదీన భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లను విచారించనున్నారు. 13న కామారెడ్డి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కేసు విచారించనున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి బీఆర్ఎస్‌కు సానుకూల తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version