కరీంనగర్ పాల డేయిరి ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత….

కరీంనగర్ పాల డేయిరి ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలో. పెళ్లి జరుగుతున్న కుటుంబానికి పుస్తె.మట్టలు అందజేసిన. అందజేసిన కరీంనగర్ డేయిరిపాలకేంద్రం. ఈ సందర్భంగా. నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్ రెడ్డి మాట్లాడుతూ. కరీంనగర్ పాల డైరీ కేంద్రం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగానే కళ్యాణమస్తు పథకం చేపట్టిందని దానిలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలోని పాడి రైతు పెండ్యాల దేవి రెడ్డి. జయ.ల కూతురు. రమ్య వివాహానికి. ఆడబిడ్డ పెళ్లికి కరీంనగర్.డేయిరీ. పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పుస్తె మట్టలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. దేశాయి పల్లె పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు గట్టు లక్ష్మారెడ్డి. డైరెక్టర్లు మరియు సెక్రటరీ గోపన్న గారి హరీష్. కుటుంబ సభ్యులు పాల ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు

దేశాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ.ప్రవేశాలు…..

దేశాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ.ప్రవేశాలు…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు గృహాలకు ఈరోజు గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అనేక.సంక్షేమ పథకాల్లో భాగంగా ఇందిరమ్మగృహ పథకం ఒకటని అందులో భాగంగా ఈరోజు దేశాయిపల్లి గ్రామంలో .లబ్ధిదారులైన ముగ్గురికి గృహ.ప్రవేశాలు నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ నిరుపేద సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం తీసుకొచ్చి రాష్ట్రంలో ఇండ్లు లేని వారు ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర నిరుపేద ప్రజలకు. ఎంతో అండగా ఉంటుందని తెలియజేస్తూ. ప్రభుత్వం ఇందిరమ్మ.పథకంలో ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులు ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఇస్తున్న ప్రభుత్వ ఆర్థిక సాయం తీసుకుని సకాలంలో ఇల్లు నిర్మించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పంపిన చిరు.కానుకను పట్టు వస్త్రాలను లబ్ధిదారులకు నాయకులు ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. సర్పంచులు సుధాకర్. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నాల పరుశురాం.ఆరేపల్లి బాలు. మండల ఉపాధ్యక్షులు గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగలరాజు. రాజిరెడ్డి. శ్రీరామ్. శ్రీనివాస్. లింగారెడ్డి. తిరుపతి. రమేష్. శ్రీనివాస్. కొత్త రవి. మల్లేశం. సిరిసిల్ల దేవయ్య. ఇందిరా కమిటీ సభ్యులు లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version