ధరిత్రి రక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం

ధరిత్రి రక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం

నర్సంపేటలో ధరిత్రి దినోత్సవం అవగాహన కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని విజ్‌డమ్ పాఠశాలలో స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ సయ్యద్ జావిద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై చర్చించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ భూమిని కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. “మన శక్తి – మన భూమి” అనే నినాదంతో అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.రిసోర్స్ పర్సన్‌గా బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ భూమి సమస్త జీవరాశికి ఆధారం అని, దాని పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. భూతాపం, కాలుష్యం వంటి సమస్యలపై అవగాహన పెంపొందించడం అవసరమని తెలిపారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. బోయిని వెంకటస్వామి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని కాపాడవచ్చని వివరించారు.
కార్యక్రమం ముగింపులో విద్యార్థులతో “నెల తల్లి”ను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రకాష్, రవీందర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version