పోలీసులకు ఒక రూల్ సామాన్యులకు ఒక రూలా..

పోలీసులకు ఒక రూల్ సామాన్యులకు ఒక రూలా..?

నడి రోడ్డుపై కారు పార్క్ చేసిన కారు ఆ కారుపై పోలీస్ అని స్టిక్కర్ ఉండడం గమనార్హం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,పోలీసులకు ఒక రూల్ సామాన్య ప్రజలకు మరో రూలా అంటూ స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇదంతా ఎక్కడో కాదండి మన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ఐస్టాండ్ సమీపంలో ఓ కారు నడిరోడ్డుపై పార్క్ చేసి పెట్టాడు. ఆ కారు ఎవ్వరిదో కాదండోయ్ ఆ కారుపై పోలీసు అని స్టిక్కర్ కూడా వేసుకున్నారు. పోలీసులమే కదా మమ్మల్ని ఎవ్వడా అడిగేది అనుకున్నాడో ఏమో కాని స్థానిక ప్రజలు మాత్రం ఫోటోలు తీసి సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదండి ఇక్కడి పోలీసుల తీరు అంటూ మరికొందరూ ఇలాంటి సమస్యలు జహీరాబాద్ పట్టణంలో ప్రతి రోజు సాయంత్రం వేళలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. రోడ్డు పై అడ్డదిడ్డంగా పార్క్ చేశాడు. ఆ కారు పైన పోలీస్ అని స్టిక్కర్ కూడా వేసుకున్నాడు. అదే సామాన్య ప్రజలైతే ఊరుకుంటారా వెంటనే ఫోటో కొట్టాలి ఫైన్ లు రాయాలి. మరి ఈ పోలీస్ కారు ఎవ్వరిది అతనిపై చర్యలు తీసుకుంటారా…

ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించి ఫైన్ వేస్తారా..? అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. లేక పోతే సభ్య సమాజానికి ఎం మెస్సేజ్ ఇస్తున్నట్టొ మరి అంటూ ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూద్దాం. చట్టం ఎవ్వరికైనా చట్టమే చుట్టం కాదంటూ మండిపడుతున్నారు.

ఈ కారుపై ఛలాన్లు కూడా ఉన్నాయి…

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లి వద్ద 27వ తేది డిసెంబర్ 2023 ఓవర్ స్పీడుతో వెళ్తుంటే ఫోటోలు తీసి ఫైన్ లు కూడా వేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా ఛలాన్ చెల్లించడం లేదు. ఛలాన్ 1035 రూపాయలు కూడా కట్టలేకుండా ఆ కారుకు పోలీసు అని స్టిక్కర్ వేసుకొని ఇష్టానుసారంగా నడిపిస్తుంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఓవర్ స్పీడ్ లతో, నడిరోడ్లపై పార్క్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అదే ఒక సామాన్యుడు 200 రూపాయలు లేదా 300 ఉంటేనే బైక్ తాళాలు తీసుకొని ఛలాన్ కట్టే వరకు వదలని పోలీసులు ఈ కారుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా పోలీస్ స్టిక్కర్ వేసుకుని నడుపుతున్న కారు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ వాసులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version