ఘనంగా కోట మైసమ్మ బోనాలు

ఘనంగా కోట మైసమ్మ బోనాలు

 

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం కోట మైసమ్మ బోనాలను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కోట మైసమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బోనాల పండుగ ప్రసిద్ధమైనదన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version