ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.
బెల్లంపల్లి నేటిధాత్రి :
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి మున్సిపాలిటీలోని ఆయా వార్డులలో పర్యటిస్తూ నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఉదయం 7:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు.
తదుపరి తాపీ సంఘం ఆధ్వర్యంలో అభ్యాస పాఠశాలలో సుభాష్ నగర్‌లో కాల్‌టెక్స్ ఏరియాలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం ఏ ఎం సీ చౌరస్తా వద్ద స్వర్గీయ కాక వెంకటస్వామి (మాజీ కేంద్ర మంత్రి వర్యులు) విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే కాంటా చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ విలువలు, స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు బాధ్యతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
