బీసీ రిజర్వేషన్ కోసం “బంద్ ఫర్ జస్టిస్” ర్యాలీ…

బీసీ రిజర్వేషన్ల పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతాం*

-బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ లో వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్ల విషయంలో దోబూచులాట లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం బంద్ ఫర్ జస్టిస్ పేరిట బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా హన్మకొండ యూనివర్సిటీలోని ఎస్ డి ఎల్ సిలో గల మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి మహేందర్ గౌడ్ పూలమాల వేశారు. అనంతరం యూనివర్సిటీ క్రాస్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు సకలజనులు బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్నారన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అగ్రవర్ణాల పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలులో భాగంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంలో విఫలమైందన్నారు. సమగ్ర కులగణనను మొదలుకొని..బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించడం..ఆ బిల్లు పెండింగ్ లో ఉండగానే..మరో ఆర్డినెన్స్ తేవడం..ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే..జీవో 9 ని తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘోరా తప్పిదమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం..5 శాతం ఉన్న రెడ్డిలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందని, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అలా చేసినప్పుడే బీసీలకు సముచిత న్యాయం దక్కుతుందన్నారు. అదేవిధంగా బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ బీసీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడని, బీసీల పాపం బిజెపికి తగులుతుందని, బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పనిచేస్తున్న బిజెపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మండిపడ్డారు. బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ పిలుపులో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని బిజెపి బీసీలంటే బానిసలుగా చూస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు రాణించాలంటే చట్టసభలలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని, ఇందుకు బిజెపి రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్రంలో బిజెపిని బొంద పెట్టడం ఖాయమన్నారు. బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 18 శాతానికి కుదించిన బీఆర్ఎస్ పార్టీ బంద్ లో పాల్గొని బీసీ సమాజానికి ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. సకల జనులు కలిసి బీసీ జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లను రాజకీయ కోణంలో ఆలోచించకుండా..అన్ని పార్టీలు ఏకమై బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం హన్మకొండ యూనివర్సిటీ నుండి ములుగు క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.

కండ్లకు గంతలు కట్టుకొని సిపిఐ నిరసన…

కండ్లకు గంతలు కట్టుకొని సిపిఐ నిరసన

బీజేపీ వల్లనే బీసీలకు అన్యాయం

సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే బీసీల జనాభా 60% పైగా ఉన్నప్పటికీ బీసీలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పారు. కేవలం బీసీలను ఓట్లకు వాడుకోడానికి మాత్రమే చూశారని వారి హక్కుల కోసం, రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం చూడలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఒకసారి బీసీలకు రిజర్వేషన్లకు పెంపు కు మద్దతుగా మరోసారి బీసీ రిజర్వేషన్లు పెంపు వల్ల ముస్లింలకు లాభం చేరుతుందని వ్యతిరేకంగా ద్వంద వైఖరులను పాటిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 42% ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే గవర్నర్, రాష్ట్రపతి సంతకం పెట్టకుండా బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే బీసీ ప్రజలంతా బిజెపికి బుద్ధి చెప్పే సమయం దగ్గర లో ఉందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో సిపిఐ పార్టీ ,అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. బందును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్,కుడుదుల వెంకటేశ్,నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, పొనగంటి లావణ్య, పీక రవికాంత్, రమేష్ చారి, రాజేష్, ఎకు రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135916.842.wav?_=1

 

రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు.

దుగ్గొండి,నేటిధాత్రి:

 

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో గల ప్రధాన రహదారిపై నిరసన,ధర్నా కార్యక్రమం చేపట్టగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల అధ్యక్షుడు తడుక కొమురయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.విద్య, ఉపాధి తోపాటు అన్ని విధాల బీసీ కులస్తులకు న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, జిల్లా నాయకులు మోడెం విద్యాసాగర్ గౌడ్, మహేష్ గౌడ్, కాసగాని చందూగౌడ్, సుధీర్ గౌడ్, తడుక కాంత్రి కుమార్ గౌడ్ వివిధ గ్రామాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135254.537.wav?_=2

 

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు.

42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చేయాలి

రాష్ట్రవ్యాప్త బిసి బంద్ లో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు

దుగ్గొండి,నేటిధాత్రి:*

ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోలేని అధికారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టగా ఆ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ ఆరోపించారు. బీసీ బందు కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మొగిలి మాట్లాడుతూ విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. అది అమలు కాకపోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల అమలు కోసం వివిధ బిసి కుల సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ బీసీ వర్గాలకు ఇలాంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి కేంద్రంలో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు బిసి రిజర్వేషన్ల పట్ల ఆలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి కోరారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T132744.714.wav?_=3

 

టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో, 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న బీసీల మరియు తెలంగాణ ద్రోహి అయిన మాధవరెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి పందాలు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు పైబడిన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నామమాత్రంగా జీవో ని రిలీజ్ చేసి మళ్లీ వాళ్ల వర్గానికి సంబంధించిన వ్యక్తి హైకోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గాని రేవంత్ రెడ్డి కి గాని ఎంత చతుర శుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండగ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆదిల్, మెహిన్ పటేల్, మహమ్మద్ ఆసీస్, షోహెద్, మహమ్మద్ ఒకే, ఇక్రమ్, మహమ్మద్ మోసిన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ముజ్జు, మహమ్మద్ కుతుబుద్ధిన్, మహమ్మద్ రిజ్వాన్, విజయ లక్ష్మీ, బిస్మిల్లా, అంజమ్మ, స్వీటీ, అంజన్న, కళావతి, రజిత. తదితరులు పాల్గొన్నారు

బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T132231.789.wav?_=4

 

బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం
రిజర్వేషన్లు ఇవ్వవలసిందే ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌ నిర్వహించింది.ఈ బంద్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కొరకు సర్వే నిర్వహించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపియడం జరిగింది. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ను మధ్యలో అడ్డు పెట్టుకొని నాటకం చేస్తుందని విమర్శించారు.అందుకే గవర్నర్ గారు అట్టి ఆర్డినెన్సును ఎటు తేల్చకుండా పెండింగులో పెట్టారు అన్నారు.అని దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. మాకు కోర్టుల మీద గౌరవం,నమ్మకం ఉంది.కావునా బీసీ లందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ సుంకరి రామచంద్రయ్యా అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసీ సభ్యులు చల్లూరి మధు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సి.పి.ఎం ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా బస్ డిపో ముందు ధర్నా…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T130205.494.wav?_=5

 

సి.పి.ఎం ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా బస్ డిపో ముందు ధర్నా

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

తెలంగాణ రాష్ట్ర బిసి రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపులో భాగంగా సిరిసిల్లలో బంద్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ డిపో ముందు బస్సులు బయటకు రాకుండా ధర్నా చేపట్టడం జరిగినది. అనంతరం సిరిసిల్ల పట్టణంలో ప్రదర్శన నిర్వహించడం జరిగినది.ఈరోజు బంద్ ను విజయవంతం చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరియు వాణిజ్య వ్యాపార విద్య సంస్థలకు ధన్యవాదాలు తెలుపడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్రంలో మద్దతు ఏసి కేంద్రంలో అడ్డుకుంటూ ద్వంద వైఖరి అవలంబిస్తుంది.బిజెపి పార్టీ రాష్ట్రపతి వద్ద గవర్నర్ వద్ద బీసీ బిల్లులు ఆమోదింప చేయకుంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం రమణ , జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ , అన్నదాస్ గణేష్. సిపిఎం పార్టీ నాయకులు మిట్టపల్లి రాజమల్లు , రాపల్లి రమేష్ , నక్క దేవదాస్ , ఉడుత రవి. సిరిమల్ల సత్యం , ఎలివేటి శ్రీనివాస్ , జిందం కమలాకర్ , తన్నీరు లక్ష్మీరాజం , బెజ్జిగం సురేష్.బింగి సంపత్,స్వర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కదలని ఆర్టీసీ బస్సు చక్రాలు….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T125554.238.wav?_=6

 

కదలని ఆర్టీసీ బస్సు చక్రాలు

బీసీ బంద్ లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం నేపథ్యంలో నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు చక్రాలు కదల్లేదు. ఉద్యోగులు, కార్మికులతో బంద్ లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ఉదయం 3 గంటల నుండి ఆర్టీసీ కార్మికులు బంద్ లో పాల్గొని విజయవంతం క్టారు.
దీంతో ఆర్టీసీ బస్సుల చక్రాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.నర్సంపేట డిపో బీసీ సంఘం అద్యక్షులు కందికొండ మోహన్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం నర్సంపేట నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులు, కార్మికులందరు మద్దతిచ్చామన్నారు. జిల్ల వర్కింగ్ ప్రజిడేంట్ వేములు రవి ,నాయకులు బి. రమేష్ ఎన్.ప్రవీణ్, మాదవ్ రేడ్య, కిరణ్ కుమార్ గౌడ్ ,సాంబయ్య మహేందర్, యాదయ్య, అనిల్, రాజు,శ్రీను,రవి, బాస్కర్, కిషన్, గోవర్దన్, కె యస్ రావు, ప్రబాకర్, డిపి లీల, శ్రీలత, రమణ, సరిత, శ్రీలత తదితర కార్మికులు స్వచ్చందంగా పాల్గొన్నారు.

సిరిసిల్లలో బీసీ రిజర్వేషన్ల బంద్ పై అఖిలపక్షం బైక్ ర్యాలీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T124331.616.wav?_=7

 

సిరిసిల్లలో బీసీ రిజర్వేషన్ల బంద్ పై అఖిలపక్షం బైక్ ర్యాలీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బీసీ సంఘాల, మరియు అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు మద్దతుగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పట్టణ బీసీ సంఘాలు మరియు వ్యాపార సంఘాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగనది. అంతేకాకుండా నిత్యం సిరిసిల్ల రద్దీ జనం తో ఉన్న కూడళ్లు నిర్మానుషంగా మారడం తో అటు బస్ డిపో వద్ద బిసి సంఘాల ముఖ్య నేతలు బస్ లను ఆపివేయడం, ప్రయాణి కులకు ఇబ్బంది అయ్యే విధంగా ఏర్పడంతో, దీపావళి పండగ ముందు సమయన సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఇబ్బంది చెప్పడం జరుగుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని అన్ని పార్టీలు కూడా మరియు ప్రజలు కూడా ప్రశాంతంగా మద్దతు ప్రకటించాలని బీసీ సంఘాలు కోరడం జరిగినది.

ఏకగ్రీవం చేస్తే ₹ 10 లక్షలు….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T120211.496.wav?_=8

 

ఏకగ్రీవం చేస్తే ₹ 10 లక్షలు

◆:- సర్పంచ్ ఆశావహుడి ఆఫర్

◆:- రిజర్వేషన్లపై సందిగ్ధత ఉన్నా తగ్గేదేలే..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం : బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో.9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పటికే ప్రారం భమైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే రిజ ర్వేషన్ల అంశంపై అంశంపై సందిగ్ధత కొనసాతుండ గానే జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్ష లు అందజేస్తానని ప్రకటించడం స్థానికంగా ఆసక్తిని రేపింది. గ్రామ బిఆర్ఎస్ పార్టీ మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు. గ్రామంలో 1500 ఓటర్లు ఉండగా ఇటీవల ప్రకటించిన హైకోర్టు స్టే ఇచ్చిన క్రమంలో మళ్లీ తమకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చి తనను ఏక గ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించినా ఈదులపల్లి బీసీ (మహిళ)కు రిజర్వ్ అయి ఉండటంతో మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ ప్రతి పాదనను ముందుకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

“బీసీరిజర్వేషన్”..”బిచ్చం కాదు”.. “బీసీల హక్కు”…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T115054.857.wav?_=9

 

“బీసీరిజర్వేషన్”..”బిచ్చం కాదు”.. “బీసీల హక్కు”.

సగర సంగం రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి “కానిగంటి శ్రీనివాస్”.

“నేటిధాత్రి”, హుజూరాబాద్.

 

ఈరోజు రాష్ట్రవ్యాప్త “బీసీ బంద్” లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో హుజరాబాద్ లో “బీసీ బంద్” లో తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కాని గంటి శ్రీనివాస్.

 

హుజురాబాద్ అధ్యక్షులు యంజాల వాసు. చింత చంద్రయ్య. రాచమల్ల రఘు. దొరికిన చంద్రమౌళి. కొల్లూరి మధు. భాస్కర్. అనిశెట్టి శివ. సతీష్. కొల్లూరి అనిల్. అనిశెట్టి పరమేశ్వర్ సదరు బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ హుజురాబాద్ లో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్…

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్

ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక విమలక్క ,రైతు కూలీ సంఘం (ఆర్ సి ఎస్), ఏఐఎఫ్టియు లు
సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ…
గడిచిన డెబ్బై ఎనిమిదేండ్ల భారత దేశ స్వాతంత్రంలో శోషిత జనసమూహానికి ఏమీ న్యాయం జరకపోగా ఇంకా పీడితులుగా మిగిలిపోయారనీ,కేంద్రంలోని భాజపా సర్కారు మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటూనే వస్తుందనీ,పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉన్నారనీ,దేశంలో భాజపా సర్కారు ఇప్పటికీ కుల గణన జరపకుండా న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లను బీసీ,ఎస్ సి,ఎస్ స్టీ, మైనార్టీలకు అందకుండా చేస్తున్నదనీ,భాజపా సర్కారు కూలాల మధ్య చిచ్చుపెట్టడానికి ఈ డబ్లూ ఎస్ రిజర్వేషన్ అమలు చేసి బీసీలకు అన్యాయం చేసిందనీ,
ఏ పార్లమెంటరీ రాజకీయ పార్టీలైన గడిచిన డెబ్బై ఏళ్లుగా ఎన్నికల తంతులో ఇచ్చిన బూటకపు హామీలు ప్రజలని మభ్యపెట్టడానికేనని,అయితే తెలంగాణ రాష్ట్రంలో 2023 లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ లకు ఇచ్చిన హామీలో భాగంగా 42శాతం రిజర్వేషన్ లను ప్రవేశపెట్టిందనీ,దీని కోసం జీఓ 9 తీసుకొచ్చిందనీ,కేంద్రానికి ఆర్డినెన్సు కూడా పంపిందనీ,భాజపా సర్కారు ఫాసిస్టు పాలనలో బీసీలను అణచడం కోసం బీసీ ఆర్డినెన్సును అడ్డుకుందనీ,
తక్షణమే బీసీ ల 42 శాతం బిల్లును షెడ్యూల్డ్ 9 లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని, ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేస్తుందనీ,ఈ నెల 18 న జరిగే బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రగిరి శంకర్ తెలిపారు.

బీసీ బందుకు మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి

బీసీ బందును విజయవంతం చేయాలి రవి పటేల్

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

టి ఆర్పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో టి ఆర్పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ
తెలంగాణలో ఉన్న 65% మంది బీసీ ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యాంగబద్ధంగా మనం హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలే ప్రామాణికంగా ఉంటాయి కనుక స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం ఇందులో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు విద్యాసంస్థలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అందరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గండు కర్ణాకర్ సామర చంద్రశేఖర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు…

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు

కేంద్రంపై ఒత్తిడి చేద్దాం
రిజర్వేషన్లు సాధించుకుందాం
కదలిరండి బీసీ బిడ్డలారా

కేసముద్రం/ నేటి దాత్రి

 

వాపక్ష నేతల యం పాపరావు,చొప్పరి శేఖర్,ఆవుల కట్టయ్య,శివారపు శ్రీధర్, పిలుపునిచ్చారు.
శుక్రవారం సి పి ఎం మండల కార్యాలయం లో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఎం సిపిఐయు ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడుతూ రేపటి బందులో బీసీ బిడ్డలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు, కేంద్ర బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించినామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీ వద్దకు వెళ్లే ధైర్యం లేక బీసీలను మోసం చేస్తున్నారన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసి పంపిన ఆర్టికల్ 9 లో పెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలన్నారు.రేపు జరిగే బందులో బీసీ బిడ్డలంతా ముక్తకంఠంతో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కేసముద్రం మండల కేంద్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలు బీసీ సంఘాలను కలుపుకొని రేపటి బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ల గుడిశాల వెంకన్న, చాగంటి కిషన్,నేతలు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం కావాలి

బీసీ రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.

18న బీసీ బంద్ జయప్రదం చేయాలి..

18న బీసీ బంద్ జయప్రదం చేయాలి

★బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు శివకుమార్ పాటెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్/ఝరాసంగం: అక్టోబర్ 17
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు కోసం బిసి సంఘాలు బీసీ సమాజం ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బందుకు పూర్తి మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం ఝరాసంగం మండల అధ్యక్షులు కమల్ పల్లి శివకుమార్ పటేల్ కోరారు. అన్ని కుల సంఘాల బంధువులు అందరూ 18న తలపెట్టిన బీసీ రిజర్వేషన్ బందులో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T142924.753.wav?_=10

 

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం బీజేపీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకునే రాజకీయ పార్టీని అందరూ గుర్తించాలని సీపీఐ(ఎం) భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు. ఈ రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ జరగాలన్నారు. బీజేపీ ఉన్న వేదికల్లో తాము పాల్గనేది లేదని స్పష్టం చేశారు. తాము స్వతంత్రంగా ఉద్యమాలను చేపడతామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అఖిలపక్షం సహకారంతో ఢల్లీి కేంద్రంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు , పోలేం రాజేందర్, గుర్రం దేవేందర్, ఆకుదారి రమేష్, గడప శేఖర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లో బిసి జేఏసీ ఆందోళన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T140348.461.wav?_=11

 

చందానగర్ లో బిసి జేఏసీ ఆందోళన

రిజర్వేషన్ల వ్యతిరేకులకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ కు వినతి

‘బంద్ ఫర్ జస్టిస్’ ను విజయవంతం చేయాలని సబ్బండ వర్గాలకు బిసి జేఏసీ పిలుపు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

తెలంగాణలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి బిసి జెఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం చందానగర్ లోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిసి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్న వ్యతిరేక శక్తులకు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రాన్ని జేఏసీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కో చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, తెలంగాణ బిసి కుల సంఘాల జేఏసీ కన్వీనర్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జేఏసీ నాయకులు తుడి ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ లు మాట్లాడుతూ దేశంలో స్వతంత్రం వచ్చిన నాటినుంచి నేటి వరకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేవలం బిసి లకు మాత్రమే లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

బిసి లకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 18 వ తేదీన బంద్ ఫర్ జస్టిస్ పేరుతో తలపెట్టిన తెలంగాణ బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కె సాయన్న ముదిరాజ్, బీసీ జేఏసీ నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, సగర సంఘం రాష్ట్ర సలహాదారులు కెపి రామ్ సగర, సగర సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక శ్రీనివాస్ సగర, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గంగాధర్ సగర, జేఏసీ నాయకులు జిల్ల గణేష్, సీతారాం సగర, రామకృష్ణ సగర, అశోక్ యాదవ్, నరసింహ, శంకర్ ముదిరాజ్, బాలరాజు సగర, నారాయణ రావు, శివశంకర్, ఆంజనేయులు సగర, చింతకింది రవీందర్ గౌడ్, కుమార్ యాదవ్, చెన్నం రాజు ముదిరాజ్, చందు సగర, శివ సగర, రాము, తిరుమలేష్, అడ్వకేట్ రమేష్, అంజమ్మ, మాధవి, బిక్షపతి, వెంకట నర్సింహా రావు, రమేష్ గౌడ్, రాజు ముదిరాజ్, మధుకుమార్, పెద్ద సంఖ్యలో బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు,

నేటి బీసీ సంఘాల రాష్ట్ర బంద్ కు సీపీఐ మద్దతు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T133719.880-1.wav?_=12

 

నేటి బీసీ సంఘాల రాష్ట్ర బంద్ కు సీపీఐ మద్దతు

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలని హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే నేటి తెలంగాణ రాష్ట్ర బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు మాట్లాడారు. బీసీలు దశాబ్ద కాలంగా రిజర్వేషన్లు పెంచాలని పోరాటాలు చేస్తున్న నేపద్యంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని తలపెట్టిన బంద్ కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, అన్ని కుల సంఘాలు,అన్ని వర్గాల ప్రజలు సహకరించి బంద్ లో పాల్గొనాలని తెలిపారు. అగ్రకులాల వారు బీసీ రిజర్వేషన్ ఆపాలని కోరుతూ స్టే తీసుకొచ్చిన నేపథ్యంలో బంద్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇప్పకాయల లింగయ్య, సాంబయ్య , మొండి, పౌలు, మారేపల్లి రవి, రాయలింగు,రాములు,దేవానంద్, గోపి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

42% రిజర్వేషన్ల కోసం బీసీ బంద్‌కు సగర సంఘం మద్దతు

బిసి బంద్ కు సగర సంఘం మద్దతు

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు

సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగా నే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version