అమ్మకు అక్షరమాల తో వయోజన విద్యాభివృద్ధి

అమ్మకు అక్షరమాల ద్వారా వయోజన విద్యాభివృద్ధి

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా వయోజన విద్య అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ అన్నారు.జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి,గ్రామపంచాయతీ సర్పంచ్ మిట్టపల్లి రామ్ రెడ్డి లతో కలిసి ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ అక్షరాలు దిద్ది చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, 15 నుండి 60 సంవత్సరాల లోపు వారందరూ చదువుకోవాలని,అప్పుడే సమాజంలో గౌరవ స్థానం లభిస్తుందని అన్నారు.ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాలకు నిరక్షరాస్యులు ప్రతి ఒక్కరు రావడమే కాకుండా చదువు నేర్చుకుని 100 రోజుల్లో అక్షరాస్యులుగా తయారు కావాలని,అక్షర వికాసం పుస్తకంలోని 16 చాప్టర్ లను 100 రోజులలో పూర్తి చేయాలని తెలిపారు.వయోజన విద్య నేర్చుకుంటున్న మహిళా సంఘ సభ్యులు అక్షరాస్యతతో కీలక జీవన నైపుణ్యాలు నేర్చుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అక్షర కేంద్రం వాలంటీర్లు శిరీష,దాసరి శ్యామల,జె డి ఎం.రామచందర్,ఎ పి ఎం వెంకటేష్,సి సి లు మోహన్, కృపవర్ణ,రాజమణి,వి ఓ ఎ లు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.

నిరక్షరాస్యులను అక్షరాసులుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలి…

నిరక్షరాస్యులను అక్షరాసులుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలి

మున్సిపల్ కార్యాలయంలో అమ్మకు అక్షరమాల ఒకరోజు శిక్షణ కార్యక్రమం

పరకాల,నేటిధాత్రి

 

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న అర్పిలకు మరియు ఎస్ఎల్ఎఫ్ లకు అక్షరాస్యత కార్యక్రమం అమలులో భాగంగా ఉల్లాస్-అమ్మకు అక్షరమాల ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహిళా సంఘాలలో ఉన్న నిరక్షరాస్యులను 10 మందిని గుర్తించి సంఘ పరిధిలో ఉన్నఒక వాలంటరీని ఎంపిక చేసి నిరక్షరాస్యులైన వారికి మూడు నెలలు శిక్షణ ఇచ్చి వారిని అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో డాక్టర్.కన్నం నారాయణ,మున్సిపల్ కమిషనర్ అంజయ్య,మెప్మా టిఎంసి సతీష్,సిఆర్పిలు ఎండి.జమీల బేగం,ప్రియదర్శిని,డీఎల్ఎఫ్ అధ్యక్షురాలు సాదు.నాగరాణి,కార్యదర్శి శ్యామల,కోశాధికారి,సునీత టిఎల్ఎఫ్ ఆర్పి రుక్మిణి,ఎస్ఎల్ఎఫ్,ఓబిఎస్ మరియు ఆర్పిఎస్ అమరావతి,అనురాధ,రత్న సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version