జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బడిబాట కార్యక్రమం

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బడిబాట కార్యక్రమం

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మండలంలోని వర్షకొండ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల కోసం తల్లిదండ్రులని కలిసి పాఠశాల లో జరిగే కార్యక్రమాలను వివరిస్తూ ప్రవేట్ పాఠశాల కు దీటుగా మన పాఠశాల ఉంది అని అడ్మిషన్లు సేకరిస్తున్న క్రమంలో, గ్రామ సర్పంచ్ పొన్నకంటి చిన్న వెంకట్ యొక్క కుమార్తె పొన్నకంటి తేజస్వినిని మా పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించారు, అలాగే గ్రామంలో ఇతర పాఠశాలలకు పంపే తల్లిదండ్రులకు కూడా మన ఊరి పాఠశాలలో అన్ని చక్కని వసతులు ఉన్నాయని ఉపాధ్యాయులు మంచిగా బోధిస్తున్నారని అలాగే అమ్మాయిలకు కుట్టుమిషన్లు అబ్బాయిలకు వ్యవసాయం మరియు చదువుతోపాటు నేర్పిస్తున్నారని ఇట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వారితోపాటు వార్డు సభ్యులు కూడా వారి ఇంట్లో పిల్లల్ని ఉన్నత పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, శివ కృష్ణ, ఇమ్మానుయేల్, స్వామి మరియు గ్రామంలోని ఉన్నటువంటి నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

నిరక్షరాస్యులను అక్షరాసులుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలి…

నిరక్షరాస్యులను అక్షరాసులుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలి

మున్సిపల్ కార్యాలయంలో అమ్మకు అక్షరమాల ఒకరోజు శిక్షణ కార్యక్రమం

పరకాల,నేటిధాత్రి

 

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న అర్పిలకు మరియు ఎస్ఎల్ఎఫ్ లకు అక్షరాస్యత కార్యక్రమం అమలులో భాగంగా ఉల్లాస్-అమ్మకు అక్షరమాల ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహిళా సంఘాలలో ఉన్న నిరక్షరాస్యులను 10 మందిని గుర్తించి సంఘ పరిధిలో ఉన్నఒక వాలంటరీని ఎంపిక చేసి నిరక్షరాస్యులైన వారికి మూడు నెలలు శిక్షణ ఇచ్చి వారిని అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో డాక్టర్.కన్నం నారాయణ,మున్సిపల్ కమిషనర్ అంజయ్య,మెప్మా టిఎంసి సతీష్,సిఆర్పిలు ఎండి.జమీల బేగం,ప్రియదర్శిని,డీఎల్ఎఫ్ అధ్యక్షురాలు సాదు.నాగరాణి,కార్యదర్శి శ్యామల,కోశాధికారి,సునీత టిఎల్ఎఫ్ ఆర్పి రుక్మిణి,ఎస్ఎల్ఎఫ్,ఓబిఎస్ మరియు ఆర్పిఎస్ అమరావతి,అనురాధ,రత్న సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version