జహీరాబాద్‌లో రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ

*రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ*

◆-: జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

జహీరాబాద్ వ్యవసాయ సహాయ కేంద్రం నందు జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మీదుగా రైతులకు వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా వ్యవసాయ పనిముట్లు అనగా రోటవేటర్ పవర్ స్ప్రేయర్ బ్యాటరీస్ప్రేయర్ పవర్ విడర్ మొదలగు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు ఈ అవకాశాన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి సర్పంచ్ లు సురేష్ ,జగదీష్ ,వ్యవసాయ సంచాలకులు బిక్షపతి మండల వ్యవసాయ అధికారి లావణ్య వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రదీప్ కుమార్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

రాయుతీ పై వ్యవసాయ పనిముట్లు..

రాయుతీ పై వ్యవసాయ పనిముట్లు

మండల వ్యవసాయ శాఖ అధికారి బి. వీరాసింగ్

మరిపెడ నేటిధాత్రి

 

మండలంలో లో 2025-26 ఆర్థిక సంవత్సరంకు గాను వ్యవసాయ శాఖలో సబ్ మిషన్ అన్ ఆగ్రికల్చర్ మెకనైజేషన్” (SMAM) పథకం ద్వారా సబ్సిడిలో వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో బ్యాటరీ స్ప్రేయర్లు – 256, పవర్ స్ప్రేయర్లు – 46, రోటవేటర్లు – 18 సీడ్ కం ఫర్టి డ్రిల్స్ – 3 డిస్క్ హరో/కల్టివేటర్స్ / కేజ్ వీల్స్ / యంబి -ప్లవ్స్ – 23, బండ్ ఫార్మర్స్ – 1, పవర్ వీడర్స్ – 2 బ్రష్ కట్టర్స్ – 3 పవర్ టిల్లర్స్ – 2మరియు స్ట్రా బౌలర్స్ -3 అందుబాటులో ఉన్నాయని ఎస్సి ,ఎస్టి మరియు మహిళా రైతులకు 50 శాతం రాయితీతో, మిగితా రైతులకు 40 శాతం రాయితి పై కలవని మండల వ్యవసాయ శాఖ అధికారి బి. వీరా సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు, కావలసిన పత్రాలు : పట్టాదార్ పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ట్రాక్టర్ ఆర్సి కార్డు,తో పాటు దరఖాస్తు ఫారం నింపి మండల వ్యవసాయ కార్యాలయంలో ఈ నెల 31 లోపు మీ గ్రామ ఏఈఓకి సమర్పించి రైతులు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.

రైతు నేస్తం’ కార్యక్రమం…

రైతు నేస్తం’ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశం పాల్గొన్నారు. ప్రస్తుత యాసంగిలో ఝరాసంగం మండలానికి 10 క్వింటాళ్ల కుసుమలు కేటాయించడమైనది అని తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తెలిపారు.విత్తనాలతోపాటు ప్రదర్శనా క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు జాతీయ నూనె గింజల మిషన్‌, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను చేపడుతున్నామన్న మంత్రి తుమ్మల.. ఇప్పటికే యాంత్రీకరణ లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు.
ప్రస్తుతం వానాకాలం పంట ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యం ఇస్తూనే.. యాసంగిలో అమలు చే యాల్సిన పథకాలపై దృష్టి సారించామని చెప్పారు.
సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు క్లస్టర్ల గుర్తింపు, రైతుల శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version