రైతు నేస్తం’ కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి;
నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశం పాల్గొన్నారు. ప్రస్తుత యాసంగిలో ఝరాసంగం మండలానికి 10 క్వింటాళ్ల కుసుమలు కేటాయించడమైనది అని తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తెలిపారు.విత్తనాలతోపాటు ప్రదర్శనా క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు జాతీయ నూనె గింజల మిషన్, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను చేపడుతున్నామన్న మంత్రి తుమ్మల.. ఇప్పటికే యాంత్రీకరణ లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు.
ప్రస్తుతం వానాకాలం పంట ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యం ఇస్తూనే.. యాసంగిలో అమలు చే యాల్సిన పథకాలపై దృష్టి సారించామని చెప్పారు.
సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు క్లస్టర్ల గుర్తింపు, రైతుల శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు..
