రాయుతీ పై వ్యవసాయ పనిముట్లు
మండల వ్యవసాయ శాఖ అధికారి బి. వీరాసింగ్
మరిపెడ నేటిధాత్రి
మండలంలో లో 2025-26 ఆర్థిక సంవత్సరంకు గాను వ్యవసాయ శాఖలో సబ్ మిషన్ అన్ ఆగ్రికల్చర్ మెకనైజేషన్” (SMAM) పథకం ద్వారా సబ్సిడిలో వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో బ్యాటరీ స్ప్రేయర్లు – 256, పవర్ స్ప్రేయర్లు – 46, రోటవేటర్లు – 18 సీడ్ కం ఫర్టి డ్రిల్స్ – 3 డిస్క్ హరో/కల్టివేటర్స్ / కేజ్ వీల్స్ / యంబి -ప్లవ్స్ – 23, బండ్ ఫార్మర్స్ – 1, పవర్ వీడర్స్ – 2 బ్రష్ కట్టర్స్ – 3 పవర్ టిల్లర్స్ – 2మరియు స్ట్రా బౌలర్స్ -3 అందుబాటులో ఉన్నాయని ఎస్సి ,ఎస్టి మరియు మహిళా రైతులకు 50 శాతం రాయితీతో, మిగితా రైతులకు 40 శాతం రాయితి పై కలవని మండల వ్యవసాయ శాఖ అధికారి బి. వీరా సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు, కావలసిన పత్రాలు : పట్టాదార్ పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ట్రాక్టర్ ఆర్సి కార్డు,తో పాటు దరఖాస్తు ఫారం నింపి మండల వ్యవసాయ కార్యాలయంలో ఈ నెల 31 లోపు మీ గ్రామ ఏఈఓకి సమర్పించి రైతులు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.
