గ్రామపంచాయతీ బిల్లులు మంజూరులో ఆలస్యం ప్రజలతో ఇబ్బందులు పడుతున్న సెక్రటరీలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ గ్రామపంచాయతీ బిల్లులు మంజూరులో ఆలస్యం ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెక్రటరీలు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అభివృద్ధి పనులు పూర్తయినా బిల్లులు మంజూరు కాకపోవడం వల్ల గ్రామపంచాయతీ సెక్రటరీలు గ్రామ ప్రజలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు పూర్తయ్యాక తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం సెక్రటరీలు పలుమార్లు ఉన్నతాధికారులను సంప్రదించినప్పటికీ బిల్లులు విడుదల కాకపోవడం వల్ల గ్రామస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ప్రజలతో ప్రతిరోజూ ఎదురెదురుగా నిలబడి ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. గ్రామాభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని స్థానిక ప్రజలు, సెక్రటరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.