acbki chikkina avinithi chepa, ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప అవినీతికి పాల్పడుతూ మెప్మాకు చెందిన ఓ కో-ఆర్డినేటర్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మెప్మా సమన్వయ అధికారి (డిఎంసి) కమలశ్రీ పొదుపు సంఘం సభ్యురాలి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. రుణం మంజూరుకూ, రిసోర్స్‌ పర్సన్‌ నియామకానికి సంబంధించి లంచం డిమాండ్‌ చేసి, రూ.40 వేలు తీసుకుంటుండగా అధికారులు రైడ్‌ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.

Read More