105 samvasarala veduka, 105 సవత్సరాల వేడుక

105 సవత్సరాల వేడుక వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్థన్నపేట మండలం కట్రియాల గ్రామంలో ఓ అవ్వ 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన చెవ్వల్ల మల్లమ్మకు నాలుగు తరాలకు చెందిన కొడుకులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాల్లు అందరు కలసి శతదినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తబట్టలు పెట్టి సంబరాలు చేసుకున్నారు. మల్లమ్మ కొడుకులు చెవ్వల్ల బొంద్యాలు, సత్తయ్య, చేరాలు, రామక్క, వారి కుటుంబాలు స్వగ్రామమైన కట్రియాలలో శతదిన వేడుకలు చేసుకున్నారు.