సమ్మర్ సీజన్, బడిబాటపై అవగాహన
సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌లో సమ్మర్ సీజన్, బడిబాటలపై తెలంగాణ సాంస్క తిక సారధి, టీమ్‌లీడర్ గడ్డం శ్రీనివాస్ అవగాహన కల్పించారు. శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్ గ్రామాలు పెద్దూర్, జగ్గారావుపల్లి, సర్దాపూర్ గ్రామాల్లో జిల్లా సమాచారశాఖ ఆదేశాలతో గడ్డం శ్రీనివాస్ బందంచే సమ్మర్ సీజన్, టిబి వ్యాధి, బడిబాటలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లితండ్రులు కషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏవిధమైన ఫీజులు లేకుండా నాణ్యమైన విద్య, మంచి సంస్క తి, ఆరోగ్యమైన వాతావరణం ఉంటుందని వివరించారు. కూలి పనులు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు, మండుటెండలకు అందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలని అన్నారు. ఎండలోకి వెళ్లే ముందు తలపాగా, టోపి ధరిస్తూ, గొడుగు, మంచినీరు వెంట ఉంచుకోవాలని చెప్పారు. పిల్లలు, వద్దులు, గర్భిణులు, బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు, ధీర్ఘ వ్యాధిగ్రస్తులపై వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కనుక ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, తెల్లని, వదులైన కాటన్ దుస్తులు ధరించడం మంచిదని సూచించారు. మజ్జిగ, నిమ్మ, కొబ్బరినీళ్లు తాగడం, అధికంగా ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిదని, ఎండలో ఎలాంటి రక్షణ లేకుండా తిరగడం, నీళ్లు తక్కువగా, మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా వడదెబ్బ తగులుతుందని తెలిపారు. తల తిరగడం, తీవ్ర తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం, బాగా జ్వరం రావడం అనిపిస్తే సత్వర చికిత్స అందజేయాలని, లేకుంటే ప్రమాదకరం, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణం, నీడలో కాసేపు సేదతీర్చి మంచినీరు తాగించి, తడిగుడ్డతో తుడిచి, చల్లని నీటిస్నానం చేయించి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వివరించారు. అదేవిధంగా టీబీ వ్యాధి గాలి ద్వారా మైక్రో బ్యాక్టీరియా, ఒకరినుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అని, టిబి2 వరకు పైగా జ్వరం, తేమడతో కూడిన దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, నీరసం, తిమ్మిర్లు, రాత్రిపూట చెమటలు, ఈ లక్షణాలు కనిపిస్తే సమీప ఏరియా ఆస్పత్రులలో పరీక్షలు చేయించాలని సూచించారు. టిబి అని నిర్దారణకు వస్తే భయపడే అవసరం లేదని, తగు జాగ్రత్తలతో డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ, వ్యాధికి తగు మందుల కోర్సును వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణకోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఎడ్మల శ్రీధర్‌రెడ్డి, ఆకునూరి దేవయ్య, గడ్డం దేవయ్య, కాయితోజు ప్రవీణ్, పొత్తురి రాజు, కొడుమోజు లక్ష్మినారాయణ, ఆయా గ్రామల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.