తెలంగాణ ప్రభుత్వం నూతన చిహ్నంపై సూచనలు

హసన్ పర్తి / నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తూ ఆ స్థానంలో కొత్త చిహ్నం తీసుకురావాలని ప్రకటించడం పై ధర్మ సమాజ పార్టీ నూతన చిహ్నన్ని రూపొందించింది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని తహసీల్దార్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆధ్వర్యం లో పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు మండల కమిటీ లతో కలిసి మండల సీనియర్ అసిస్టెంట్ కు ప్రతిపాదిస్తున్న నమూనా చిహ్నాన్ని అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ వివిధ పార్టీల నుండి సంస్థల నుండి ప్రతిపాదనలు తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని ఆశిస్తు ఇందులో భాగంగానే ధర్మ సమాజం పార్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రతిపాదిస్తున్న ఈ చిహ్నంలోని గొప్పతనం ఏంటంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ని ఈ చిహ్నంలో ఉంచాము ఇది మన తెలంగాణ ప్రజలు ఎంతో గర్వించదగ్గ విషయం మరియు అగ్రవర్ణ భూస్వామ్య పాలకవర్గంపై అనగారిన వర్గాల రాజ్యం కోసం హక్కుల కోసం యుద్ధం చేసిన పండగ సామన్న, సర్దార్ సర్వాయి పాపన్న, సమ్మక్క, సారక్కల చిత్రాలను కూడా ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రాతిపాదిక చిహ్నంలో ఉంచాం ఈ ప్రాతిపదికన చిహ్నంలో ఉంచిన ఈ ఆరు చిత్రాలు సమాజంలో పీడిత వర్గాల యోధుల పోరాట స్ఫూర్తియని భావితరాల తెలంగాణ ప్రజలకు సాంస్కృతిక వారసత్వానికి ప్రత్యేకం అవుతుంది కాబట్టి దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధర్మసమాజ్ పార్టీగా మేము ప్రతిపాదిస్తున్న దీనిని ఆమోదించి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల సమైక్యవాదన గా ఉంటుందని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *