అఖిల భారత విద్యార్థి పరిషత్ ABVP హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఆర్ యూనివర్సిటీలో ధర్నా చేయడం జరిగింది.
ఎస్ఆర్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ అధిక ఫీజులు, కండోనేషియన్ ఫీజుల వసూలు చేస్తున్న యూనివర్సిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఫీజులు తగ్గించాలి అని విద్యార్థులతో ధర్నా చేయడం జరిగింది. గత సెమిస్టర్ లో కన్ఫర్మేషన్ ఫీజు 500 ఉంటే ఈ సంవత్సరం వెయ్యి రూపాయలు చేశారు ఒకవేళ 60% కన్నా తక్కువ ఉంటే 2000 కంటిన్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నారు .ఈ యొక్క ధర్నాలో అనేకమంది యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొని ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయడం జరిగింది.
ఇకనైనా మేనేజ్మెంట్ ఫీజులు తగ్గించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా యూనివర్సిటీని ముట్టడిస్తామని కూడా విద్యార్థి పరిషత్ అని విద్యార్థులకు భరోసా ఇచ్చేలాగా మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంగం సమిత్ రెడ్డి, వరంగల్ మహానగర్ కార్యదర్శి తాళ్లపల్లి అరుణ్, ఎస్ ఎఫ్ డి వరంగల్ విభాగ్ కన్వీనర్ రావణవేణి రోహిత్, శ్రీశాంత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.