స్ట్రాంగ్ రూములను పరిశీలించిన ఎస్పీ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో గల మొదటి, రెండవ విడత బ్యాలెట్ బాక్సులను బద్దెనపల్లి మోడల్ స్కూల్‌లోని స్ట్రాంగ్ రూములను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గార్డు సిబ్బంది, సీసీ కెమెరాలు ఏర్పాటు, చుట్టూ ఏర్పాటుచేసిన లైటింగ్ తదితర భద్రతా ఏర్పాట్లను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని భద్రతా సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట సిరిసిల్ల డిఎస్పీ వెంకటరమణ, సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్‌కుమార్, తంగళ్లపల్లి ఎస్సై శేఖర్ ఉన్నారు.