భూదాన్ భూమాపియాపై కఠిన చర్యలు తీసుకోవాలి

సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ శంకర్ నాయక్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోచమ్మ టెంపుల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి సర్వోదయం మండలి రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరైనారు అనంతరం మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి భూదాన్ భూములను నిజమైన పేదవారికి అందకుండా గత ప్రభుత్వాలు బోర్డు మాజీ నాయకులు అక్రమాలకు పాటుపడుతూ భూదాన్ భూములలో భూ మాఫియా గా వ్యవహరించారు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఉక్కు పాదం మోపాలి భూదాన్ భూములను కాపాడాలని భూపాలపల్లి జిల్లా సర్వోదయమండలి మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు ఒక మంచి ఆశయంతో ఆచార్య బినో బాబాయ్ భూస్వాములకు నుండి భూమిని దానంగా 1951 లో దాదాపు 1.77.333 ఎకరాలు తీసుకొని భూమిలేని ఇల్లు లేని పేదవారికి పంపిణీ చేయాలని 1965 భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత కెసిఆర్ ప్రభుత్వం బోర్డును రద్దుచేసి భూదాన్ భూములను పేదవారికి పంపిణీ చేయకుండా ఇష్ట రాజ్యాంగా ఆక్రమించుకోవడం తప్పుడు ప్రోస్డింగ్ సృష్టించుకోవడం మై హోమ్ రాజేశ్వరరావు లాంటి వారికి భూములను అమ్ముకోవడం జరిగింది వీటిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూదాన్ భూములను కాపాడుటకు భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఇప్పటికైనా గాంధీ భవన్లో ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు పేరు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతూ పాత తేదీలతో పోస్టింగ్ ఇస్తూ తెలంగాణ ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉన్న భూదాన్ బోర్డు మాజీ నాయకుల పై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది
అనంతరం తెలంగాణ సర్వోదయ మండలి భూపాలపల్లి జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా చుండూరు గోపాలరావు అధికార ప్రతినిధిగా తడక శ్రీధర్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులుగా గంట కొండాల్ రెడ్డి సముద్రాల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా నారగాని ఎల్ల స్వామి గౌడ్ కార్యదర్శి ఉడుత రవీందర్ కోశాధికారి సమ్మిరెడ్డి కార్యవర్గ సభ్యులు తిరుపతి రాజబాబు కొయ్యల గౌతం గౌడును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *