అంతర్రాష్ట్ర వంతెన మరమ్మత్తు పనులకు ప్రారంభం.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

కాలేశ్వరం గోదావరిపై నిర్మించబడి ఉన్న అంతర్రాష్ట్ర వంతెన మరమ్మత్తు పనులకు సామాగ్రిని సిద్ధం చేయడం జరిగింది.
మండలంలోని కాలేశ్వరం గోదావరి నదిపై నిర్మించబడిన మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అంతర్ రాష్ట్ర వంతెన మరమ్మత్తు పనులు చేపట్టుటకు ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సంస్థ వంతెన పై సామాగ్రిని సిద్ధం చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్ రాష్ట్ర వంతెన అనేక భారీ మరియు చిన్న తరహా వాహనాలు రాకపోకలు కొనసాగించడంతో వంతెన పై ఉన్న డాంబర్ తోపాటు పలు చోట్ల పగిలిపోవడం జరిగింది. అలాగే గత వర్షాకాలం మహారాష్ట్ర తో పాటు తెలంగాణ వైపు వంతెనకు మొదట్లో ఉన్నటువంటి ఎడిజి రోడ్ పూర్తిగా కొట్టుకపోవడం జరిగింది. తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి రాకపోకలు నేటికీ కొనసాగడం జరుగుతుంది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం నుండి అంతరాష్ట్ర వంతెన మరమ్మత్తు తోపాటు ఎడ్జి రోడ్లను పూర్తిస్థాయిలో పటిష్టంగా నిర్మించుటకు ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సంస్థకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ సంస్థ ఇప్పటికే మహారాష్ట్ర వైపు నుండి అంతర్ రాష్ట్ర వంతెనకు సంబంధించి ఎడ్జి రోడ్డు పనులతో పాటు మూడు కిలోమీటర్ల హైవే రోడ్డులు నిర్మించే పనిని ప్రారంభించింది. మరో రెండు మూడు రోజుల్లో అంతర్ రాష్ట్ర వంతెనతో పాటు తెలంగాణ వైపు బ్రిడ్జి కు సంబంధించిన ఎడ్జ్ రోడ్డు నిర్మాణ పనుల కు వంతెన పై దాంబర్, సిమెంట్ పెయింట్, కాంక్రీట్ డస్ట్ ను సిద్ధం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *