కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి
రాజు, మహమ్మద్ రఫీ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రిన్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలానికి చెందిన జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు, మహమ్మద్ రఫీ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన కోసం వచ్చిన రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ ప్రభుత్వము ప్రాజెక్టుల పేరు చెప్పుకొని వేల కోట్లు కుంభకోణం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులు నాణ్యత లేకుండా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు కకృతి పడి వేలకోట్ల దోచుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం జరిగింది అలాగే మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా తెలంగాణ ప్రజలు చెంప చెల్లుమనిపించారు ఇకనైనా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బుద్ధి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి తప్పులను ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందిగా ఆయన కోరారు