“రాష్ట్రస్థాయి “గ్రీన్ చాంపియన్ -2024″అవార్డు విజేత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,లక్షెట్టిపేట”.

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి (తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ )వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కళాశాలల విభాగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట” గ్రీన్ ఛాంపియన్ అవార్డ్ 2024 -ప్రథమ బహుమతిని” గెలుచుకుంది .
ఈ అవార్డును” ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024″సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి , పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక రంగాల ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీమతి వాణి ప్రసాద్ ఐఏఎస్ మెంబర్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓఝా స్వీకరించారు.
కళాశాలలో చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నిరంతరం కొనసాగుతున్న మొక్కల పెంపకం, నీటి వనరుల పొదుపు ,విద్యుత్ పొదుపు, ప్లాస్టిక్ రహిత కళాశాల ప్రాంగణము ,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కళాశాల నందు మరియు లక్షెట్టిపేట మున్సిపాలిటీ నందు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు మరియు లక్షట్ పేట నందు నిర్వహించిన” క్లీన్ గోదావరి – సేవ్ గోదావరి “కార్యక్రమానికి లభించిన గుర్తింపు ఇది అని ఆనందాన్ని వ్యక్తం చేశారు ,
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుండి ప్రముఖ సీనియర్ సామాజికవేత్త శ్రీ ప్రసన్న కుమార్ పర్యవేక్షించి, ప్రశంసించి ఈ కార్యక్రమాలను ఇలాగే కొనసాగించాల్సిందిగా సూచించారు. ఇదేవిధంగా మరిన్ని కార్యక్రమాలు కళాశాలలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కళాశాలకు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సునకు అనుమతి వచ్చినందుకు కళాశాల విద్యాశాఖ మాజీ కమిషనర్ శ్రీమతి వాణి ప్రసాద్ ప్రత్యేక అభినందనలు తెలియజేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు .
కళాశాల అధ్యాపక ,అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *