జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి పట్టణం, కృష్ణకాలనిలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పనలో భాగంగా
మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, నీటి కొరత సరఫరాకు బోర్లు, పైపులైన్స్ ఏర్పాటు ఇతరత్రా సదుపాయాల కల్పనకు అంచనా నివేదికలు అందజేయాలని సంబంధిత ప్రిన్సిపాల్ లను కలెక్టర్ ఆదేశించారు.
కళాశాలల్లో మౌలిక వసతులను జిల్లా ఇంటర్మిడియట్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కళాశాలల్లో చదివే బాలురు, బాలికల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 5 జూనియర్ కళాశాలలు ఉండగా అన్ని కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతులు లాగే జూనియర్ కళాశాల్లో త్వరలోనే పనులను చేపడుతామని అందుకు ప్రతి పాదనలు అందచేయాలని తెలిపారు. జాన్ 10 నుండి 12 వరకు కళాశాలలు పునఃప్రారంభం కానున్నందున విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని అన్నారు. జిల్లాలోని కాటారం, మహాదేవ్ పూర్, తాడిచర్ల, భూపాలపల్లి, చిట్యాల మండలాల్లో ఉన్న జూనియర్ కళాశాలల్లో చదువుకునే వారి సంఖ్య పెరిగేలా చొరవ చూపాలని అన్నారు. ఒకవేళ ఈ ఐదు కళాశాలల్లోని డే స్కాలర్స్ ఉండి చదవడానికి ఆసక్తి లేని వారికోసం ఆయా కాలేజీ పరిసల ప్రాంతాల్లోని ఏదైనా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి హాస్టల్స్ ఏర్పాటు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధికారి దేవరాజం, 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు తదితరులు పాల్గొన్నారు.